Getup Seenu : బుల్లితెరపై స్టార్ కమెడియన్‌గా గెటప్ శీను ఎంతటి పేరు తెచ్చుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్ షోలో సుడిగాలి సుధీర్ టీమ్‌లో శీను పలు రకాల భిన్నమైన గెటప్‌లు వేస్తూ కామెడీని పండించడంలో ఆరి తేరిపోయాడు. ఈ క్రమంలోనే శీను చేసే కామెడీ ఎంతో మందిని ఆకట్టుకుంటుంది. అతను వేసే పంచ్‌లు కూడా అలరిస్తుంటాయి. జబర్దస్త్ వేదికగా పరిచయమైన శీను పలు సినిమాల్లోనూ నటించాడు. సుడిగాలి సుధీర్ స్కిట్ వస్తుందంటే.. అందులో గెటప్ శీను ఉన్నాడా.. అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఈ క్రమంలోనే ఓ వైపు జబర్దస్త్ వంటి కామెడీ షోలు చేస్తూనే మరోవైపు సినిమాల్లోనూ శీను నటిస్తున్నాడు.
జబర్దస్త్ వేదికపై సుడిగాలి సుధీర్, గెటప్ శీను, ఆటో రాంప్రసాద్‌కు అసలు తిరుగులేదు. వీరు ముగ్గురూ కలిసి ఎన్నో అద్భుతమైన స్కిట్‌లు చేశారు. ఇక జబర్దస్త్ షో ద్వారా వచ్చిన పాపులారిటీతో శీను అనేక మంది అభిమానులను సంపాదించాడు. అలాగే పలు ప్రోగ్రామ్స్, ఈవెంట్స్ కూడా చేస్తున్నాడు. ఈ క్రమంలోనే గెటప్ శీను ప్రస్తుతం అందరినీ సహాయం చేయాలని కోరుతూ అడుగుతుండడం అందరినీ షాక్‌కు గురి చేస్తోంది.
గెటప్ శీను అందరినీ సహాయం చేయాలని కోరుతున్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో అసలు గెటప్ శీనుకు ఏమైందా.. అని ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వాస్తవానికి శీను సహాయం అడుగుతున్నది తన కోసం కాదు. ఆనంద్ అనే వ్యక్తి కోసం. అతను రాజమండ్రిలోని ఓ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా.. చికిత్స కోసం రూ.4 లక్షలు అవుతాయని చెప్పారు. దీంతో అతనికి సహాయం చేయాలని కోరుతూ శీను అందరినీ అడుగుతున్నాడు. బాధితులు గెటప్ శీనును సంప్రదించడంతో అతను రంగంలోకి దిగి విరాళాలు సేకరించే పనిలో పడ్డాడు. ఇదీ అసలు విషయం. తన అభిమానులు ఆనంద్‌కు సహాయం చేయాలని శీను కోరుతున్నాడు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…