Vani Vishwanath : చిరుతో స్టెప్స్ వేసిన ఈ భామను గుర్తు పట్టారా? ఇప్పుడు ఎలా ఉంది.. ఏమి చేస్తుందో తెలిస్తే అసలు నమ్మలేరు..

Vani Vishwanath : ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న వాణీ విశ్వనాథ్ అంటే తెలియనివారు ఉండకపోవచ్చు. 1990వ దశకంలో పలు హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. చూడ చక్కని రూపం, మంచి అభినయంతో ఆకట్టుకునే ఈమె తెలుగుతో పాటు మలయాళం, తమిళ, కన్నడ, హిందీలో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. వాణీ విశ్వనాథ్ లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే దాదాపు అన్ని భాషల్లోనూ అగ్ర హీరోలందరి సరసన 120 చిత్రాలకు పైగా నటించింది.

ఇక ఆరోజుల్లో వాణీ విశ్వనాథ్ ఉంటే చాలు సినిమా మినిమమ్ గ్యారంటీ అని నమ్మేవారట దర్శక నిర్మాతలు. అందుకు తగ్గట్టుగానే టాలీవుడ్ లో కమర్షియల్ మూవీసే కాకుండా ఎక్కువ కుటుంబ కథా చిత్రాల్లో కూడా నటించి మెప్పించి, మార్కెట్ లో ఆమె క్రేజ్ పెంచుకుంది. ప్రధానంగా మలయాళం మరియు తెలుగు చిత్రాలలో కనిపించింది. 2000లో, టీవీ చంద్రన్ దర్శకత్వం వహించిన సుసన్నాలో తన నటనకు వాణీ విశ్వనాథ్ రెండవ ఉత్తమ నటిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును గెలుచుకుంది. వాణీని మాలీవుడ్ యొక్క యాక్షన్ క్వీన్ అని పిలుస్తారు.

Vani Vishwanath

నిజానికి కేరళ అమ్మాయి అయిన వాణీ 13 మే 1971 ఒల్లూర్ , కేరళలో జన్మించారు. వాణీ తండ్రి తాళత్తు విట్టల్ విశ్వనాథన్ కేరళలో మంచి పేరు పొందిన జ్యోతిష్యుడు. తల్లి గిరిజ సాధారణ గృహిణి. ఈ దంపతులకు ఐదుగురు సంతానం. అందులో నాలగవ సంతానం వాణీ విశ్వనాథ్. తాళత్తు విట్టల్ విశ్వనాథన్ ఎంత పాపులర్ అంటే సినిమా వాళ్ళందరూ నిర్మాతలందరూ ఈయన దగ్గరకే వచ్చి, ఓపినింగ్ నుంచి రిలీజ్ దాకా ముహుర్తాలు ఈయన దగ్గరే పెట్టించుకునేవారట.

వాణీ విశ్వనాథ్ తన పాఠశాల విద్య ఒల్లూరులోని సెయింట్ రాఫెల్స్ కాన్వెంట్ గర్ల్స్ హై స్కూల్‌లో మరియు ఆ తర్వాత చెన్నైలో చదివింది. ఆమె 13 సంవత్సరాల వయస్సులో, ఆమె తండ్రి జ్యోతిష్యం ద్వారా ఆమె నటిని అవుతానని మరియు ఆమె రాజకీయాల్లోకి వస్తానని జోస్యం చెప్పారట. తండ్రి చెప్పిన విధంగానే ఆమె మలయాళం మరియు తెలుగు సినిమాలలో కనిపించింది. ఆమె వరుసగా మమ్ముట్టితో ది కింగ్‌లో మరియు మోహన్‌లాల్‌తో ఉస్తాద్‌లో మరియు సురేష్ గోపీతో చింతామణి కొలకాసేలో నటించింది. వాణీ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవితో నటించిన ఘరానా మొగుడు మూవీతో భారీ విజయాన్ని అందుకుంది. వాణి ఫైటింగ్ మరియు మార్షల్ ఆర్ట్స్‌లో కూడా శిక్షణ పొందింది మరియు సినిమాల్లో చాలా మంది పురుషులతో కూడా ధైర్యంగా పోరాడింది. వాణీ విశ్వనాథ్ సూపర్ స్టార్ మిథున్ చక్రవర్తితో జంగ్ మరియు భీష్మ అనే రెండు హిందీ చిత్రాలలో కూడా నటించింది.

ఇక ఆ తరువాత మలయాళ సినిమాల్లో విలన్ వేస్తూ,  కమెడియన్ గా మారిన బాబు రాజ్ తో పలు చిత్రాల్లో నటించిన వాణీ చివరకు అతనితో ప్రేమలో పడి 2002లో వివాహం చేసుకుంది. ఈ జంటకి అర్చా, అద్రి అనే ఇద్దరు పిల్లలున్నారు. వివాహమైన తర్వాత పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన వాణీ 2017లో జయ జానకి నాయక చిత్రం ద్వారా టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చింది.  అంతేకాకుండా వాణీ విశ్వనాథ్ 2017లో ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీలో చేరారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్.. టీ20 వరల్డ్ కప్ నుంచి అవుట్! స్కాట్లాండ్‌కు బంపర్ ఆఫర్..

భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…

Saturday, 24 January 2026, 5:25 PM

BSSC ఇంటర్ లెవల్ నోటిఫికేషన్ 2026: అభ్యర్థులకు గుడ్ న్యూస్.. దరఖాస్తు గడువు పొడిగింపు!

బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…

Saturday, 24 January 2026, 10:15 AM

రాయ్‌పూర్ టీ20: కివీస్‌పై భారత్ ఘనవిజయం.. సిరీస్‌లో 2-0 ఆధిక్యం!

రాయ్‌పూర్ వేదికగా జ‌రిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ ల‌క్ష్యాన్ని…

Friday, 23 January 2026, 10:53 PM

పప్పులను వండే ముందు నానబెడుతున్నారా? లేదంటే డేంజరే.. న్యూట్రిషనిస్ట్ చెబుతున్న షాకింగ్ నిజాలు!

భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…

Friday, 23 January 2026, 8:02 PM

విశ్లేషణ: బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు స్వయంకృతాపరాధం.. పాక్ మాటలు నమ్మి వరల్డ్ కప్‌కు దూరం?

ఎదుటి వ్య‌క్తి క‌ష్టాల్లో ఉంటే అత‌ని ప‌రిస్థితిని కొంద‌రు త‌మ‌కు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆస‌రాగా చేసుకుని త‌మ స్వ‌ప్ర‌యోజ‌నాలు…

Friday, 23 January 2026, 3:54 PM

మీ పాన్ కార్డు పోయిందా? స్మార్ట్‌ఫోన్‌లోనే ‘ఇ-పాన్’ డౌన్‌లోడ్ చేసుకోండి.. పూర్తి ప్రాసెస్ ఇదే!

ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…

Friday, 23 January 2026, 9:51 AM

అల్లు అర్జున్ పోస్ట్‌పై నయనతార ఇంట్రెస్టింగ్ రియాక్షన్.. మెగాస్టార్ సినిమాపై ‘పుష్ప’రాజ్ పోస్ట్ వైరల్!

మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…

Thursday, 22 January 2026, 4:46 PM

కేవలం రూ.9,699కే 32 ఇంచుల స్మార్ట్ టీవీ.. బ్లౌపంక్ట్ నుంచి అదిరిపోయే లాంచ్!

బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…

Thursday, 22 January 2026, 1:51 PM