Vamika : కూతురి ఫేస్ క‌నిపించీ క‌నిపించ‌న‌ట్టు చూపిస్తున్న అనుష్క‌..!

October 15, 2021 10:55 AM

Vamika : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి భార్య, బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ జనవరి 11న ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఓ పండంటి పాపకు జన్మనిచ్చిన విష‌యం తెలిసిందే. తమ ముద్దుల తనయకు వామికా అని పేరు పెట్టారు. పాప పుట్టిన‌ప్ప‌టి నుండి ఆమెకు సంబంధించిన ప‌లు ఫొటోలను షేర్ చేయ‌గా, ఇందులో ఎక్క‌డ కూడా వామికా ఫేస్ రివీల్ చేయ‌లేదు. పాప‌ని చూడాల‌ని అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

Vamika anushka sharma shared her daughter photo

కుమార్తెతో కలిసి ఆడుకుంటోన్న ఎన్నో ఫన్నీ మూవ్ మెంట్స్ ని విరుష్క సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఎప్పటికప్పుడు వామిక ఫోటోల్ని ఇన్ స్టా వేదికగా అనుష్కశర్మ అభిమానులకు షేర్ చేస్తూ వారిని సంతోష పెడుతోంది. తాజాగా వామికతో అనుష్క శర్మ కొత్త ఫోటోని షేర్ చేసింది. వామిక క్రీమ్ కలర్ డ్రెస్ ధరించగా.. అనుష్క టీ షర్ట్ ధరించింది. ఇందులో వామిక ఫేస్ క‌నిపించ‌కుండా జాగ్ర‌త్త ప‌డింది అనుష్క‌.

అనుష్క కూతురు వామిక మొద‌టి బ‌ర్త్ డే మ‌రి కొద్ది రోజులలోరానుండ‌గా, ఆ రోజు కూతురి ఫేస్ రివీల్ చేస్తారేమోన‌ని అంద‌రు భావిస్తున్నారు. ప్రస్తుతం విరుష్క ఇంట దుర్గామాత పూజలు, దసరా సంబరాలు మిన్నంటాయి. త్వ‌ర‌లో మొద‌లు కానున్న టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్‌తో కోహ్లి బిజీ కాగా, అనుష్క కూతురితో స‌ర‌దాగా గడుపుతోంది. మరోవైపు అనుష్క శర్మ తిరిగి సినిమాల్లో నటించేందుకు సిద్ధమవుతుందని కథనాలొచ్చాయి. అయితే నటనలో ఎంట్రీకి ఇంకా చాలా సమయం ఉన్నా నిర్మాతగా సినిమాల్ని ప్రారంభించనుందట.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment