Usiri Chettu Puja : కార్తీక మాసంలో భక్తులు చాలా మంది ఉదయాన్నే లేచి కార్తీక స్నానాలు ఆచరిస్తుంటారు. కార్తీక దీపాలు పెడుతుంటారు. ఇక కార్తీక పౌర్ణమి రోజు ప్రత్యేక పూజలు చేస్తారు. శివుడికి ఎంతో ప్రీతి పాత్రమైన ఈ మాసంలో ఆయనకు పూజలు, అభిషేకాలు చేస్తే ఎంతో పుణ్యం వస్తుంది. అలాగే కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులతో దీపాలను వెలిగిస్తారు. దీంతో సంవత్సరం మొత్తం పూజలు చేసిన ఫలితం ఈ ఒక్క రోజే లభిస్తుంది. అయితే కార్తీక మాసంలో దీపారాధన, తులసి పూజతోపాటు వన భోజనాలు కూడా చేస్తారు. ముఖ్యంగా ఉసిరి చెట్టుకు పూజలు చేస్తారు. ఉసిరి చెట్టు నీడలో వన భోజనాలు చేస్తారు. అయితే ఉసిరికి ఈ మాసంలో ఎందుకు అంతటి ప్రాధాన్యతను ఇచ్చారు.. అంటే..?
ఈ మాసంలో చలి ప్రారంభమవుతుంది. దీంతో మనకు అనేక వ్యాధులు వస్తాయి. అయితే ఉసిరి వల్ల మనకు సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కనుక ఉసిరికి దగ్గరగా ఉండాలని చెప్పడం కోసమే ఆ చెట్టుకు ఈ మాసంలో అంతటి ప్రాధాన్యతను కల్పించారు. ఇక ఉసిరి నీడ పడే నీటిలో స్నానం చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని.. ఆరోగ్యపరంగా కూడా మేలు జరుగుతుందని పండితులు చెబుతున్నారు.
క్షీరసాగర మథనంలో వచ్చిన అమృతం కోసం దేవదానవుల మధ్య జరిగిన యుద్ధంలో కొన్ని చుక్కల అమృతం నేలపై పడిందట. అప్పుడే ఉసిరి చెట్టు మొలిచిందని చెబుతారు. కనుక ఉసిరి సకల రోగాలను నయం చేసే శక్తిని కలిగి ఉంటుంది. దీని గురించి ఆయుర్వేదంలో ప్రధానంగా చెబుతారు. అనేక ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. ఉసిరి చెట్టు వేళ్లు భూమిలోకి వెళితే అక్కడ ఉప్పు నీరు కూడా మంచి నీరుగా మారుతుందట. కనుకనే ఉసిరికి అంతటి ప్రాధాన్యతను కల్పించారు.
అయితే ఈ మాసంలో ఉసిరి చెట్టుకు తప్పక పూజలు చేయాలి. ఉసిరి చెట్టు వద్ద దీపారాధన చేసిన అనంతరం కింద ఇచ్చిన మంత్రాలను పఠిస్తే.. ఎంతో పుణ్యం వస్తుంది. భగవంతుడి ఆశీస్సులు లభిస్తాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…