Hanuman Mantra : హిందూ పురాణాల్లో హనుమంతుడికి ప్రత్యేక స్థానం ఉంది. ఆయన చిరంజీవి అని.. ఇప్పటికీ జీవించే ఉన్నాడని.. ఆయనకు మరణం లేదని.. ఆయన హిమాలయాల్లో కనిపించాడని.. అంటుంటారు. అయితే ఈ వార్తలు నిజమో కాదో తెలియదు కానీ.. హనమంతుడు మాత్రం చిరంజీవే. ఆయనకు మృత్యువు లేదు. రాదు. అందుకనే ఆయనకు పూజలు చేస్తే మృత్యు భయం ఉండదని. అన్ని రకాల భయాలు పోతాయని అంటుంటారు. అయితే ఆంజనేయ స్వామికి చెందిన ఓ మంత్రాన్ని రోజూ పఠిస్తే.. ఎలాంటి భయాలు ఉన్నా సరే పోతాయి. ఇంతకీ ఆ మంత్రం ఏమిటంటే..
ఆంజనేయుడు మహా బలవంతుడు. భూత ప్రేత పిశాచాలను, దుష్ట శక్తులను తరిమి కొడతాడు. ఆయనను తలచుకుంటే అన్ని భయాలు పోతాయి. దుష్ట శక్తులు మన దగ్గర ఉండవు. మనల్ని బాధించవు. ఆయన మంత్రం పఠిస్తే అన్ని భయాల నుంచి విముక్తి పొందవచ్చు. సకల శుభాలు కలుగుతాయి. ఆయన మంత్రం ఇదే..
మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం పరిష్టం
వాతాత్మజం వానర యూధ ముఖ్యం శ్రీరామ దూతం శిరసానమామి
ఈ మంత్రానికి అర్థం ఇదే.. వాయువేగ మనో వేగాలతో ప్రయాణించగలవాడు, ఇంద్రియాలను జయించిన వాడు, బుద్ధిమంతుడు, అందరిలోకి ఉన్నతుడు, వాయుదేవుని పుత్రుడు. వానర యోధుల్లోకెల్లా ముఖ్యుడు, శ్రీరామ దూత అయిన ఆంజనేయుడికి నమస్కరిస్తున్నాను అని దీని అర్థం. కనుక ఈ మంత్రాన్ని రోజూ పఠిస్తే అన్నీ శుభాలే కలుగుతాయి. ముఖ్యంగా భయాలు ఉండవు. ఉదయం స్నానం చేశాక ఆంజనేయ స్వామి వద్ద బొట్టు పెట్టకుని ఈ మంత్రాన్ని పఠించాలి. ఎలాంటి భయాలు, బాధలు, ఆందోళనలు ఉండవు. ఎల్లప్పుడూ ధైర్యంగా ఉంటారు. అనుకున్న పని పూర్తి చేస్తారు. సకల శుభాలు కలుగుతాయి.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…