Smart Phone : మీ పాత స్మార్ట్ ఫోన్‌ను అమ్మేయ‌కండి.. దాన్ని సీసీటీవీ కెమెరాగా ఇలా మార్చుకోండి..!

January 26, 2022 10:49 AM

Smart Phone : సాధార‌ణంగా కొత్త స్మార్ట్ ఫోన్ల‌ను కొనుగోలు చేసే వారు అప్ప‌టి వ‌ర‌కు వాడే పాత స్మార్ట్ ఫోన్‌ల‌ను విక్ర‌యిస్తుంటారు. వాటిని ఏం చేయాలో తెలియిక ఎంతో కొంత ధ‌ర‌ల‌కు అమ్మేస్తుంటారు. అయితే అంత త‌క్కువ ధ‌ర‌ల‌కు ఆ ఫోన్ల‌ను అమ్మ‌డం క‌న్నా.. వాటిని సీసీటీవీ కెమెరాల్లాగా ఉప‌యోగించుకుంటే మ‌న ఇంటికి సెక్యూరిటీ ల‌భిస్తుంది. మ‌రి మీ పాత ఫోన్‌ను సీసీటీవీ కెమెరాగా ఎలా మార్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా..!

use your old Smart Phone as cctv camera do not sell it

మీ పాత ఫోన్ లేదా ట్యాబ్లెట్ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ అయితే.. అందులో ముందుగా Alfred అనే యాప్‌ను ఇన్‌స్టాల్ చేయండి. దీన్ని పాత ఫోన్, కొత్త ఫోన్‌ల‌లో ఇన్‌స్టాల్ చేసుకోండి. ఈ క్ర‌మంలోనే ఈ యాప్ పాత‌, కొత్త ఫోన్‌ల‌లో ఇన్‌స్టాల్ అయ్యాక అందులో సూచించిన మేర స్టెప్స్ ను ఫాలో కావాలి. దీంతో పాత దాంట్లో కెమెరా లైవ్ ఫీడ్ వ‌స్తుంది. దాన్ని కొత్త ఫోన్‌లో ఈ యాప్ ద్వారా చూడ‌వ‌చ్చు.

అయితే పాత ఫోన్ లేదా ట్యాబ్లెట్‌ను మీ ఇంట్లో లేదా ఇంటి బ‌య‌ట ఏదైనా ఒక ప్ర‌దేశంలో ఫిక్స్‌డ్ గా ఉంచాలి. దీంతో అది సీసీటీవీ కెమెరాలా ప‌నిచేస్తుంది. అందులో ఉన్న Alfred యాప్ ద్వారా లైవ్ ఫీడ్ మీ కొత్త ఫోన్‌లోని అదే యాప్‌లో క‌నిపిస్తుంది. దీంతో మీ పాత ఫోన్ సీసీటీవీ కెమెరాలా ప‌నిచేస్తుంది.

ఈ యాప్ ద్వారా డేటా మొత్తం క్లౌడ్ స్టోరేజ్‌లో 30 రోజుల పాటు సేవ్ అవుతుంది. అయితే ప్రీమియం వెర్ష‌న్‌ను కొనుగోలు చేస్తే మ‌రిన్ని స‌దుపాయాల‌ను పొంద‌వ‌చ్చు. ఈ విధంగా ఈ యాప్ స‌హాయంతో మీ పాత ఫోన్ లేదా ట్యాబ్లెట్‌ను సీసీటీవీ కెమెరాలా మార్చుకోవ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now