Dandruff : ఈ మిశ్రమాన్ని ఉపయోగిస్తే.. ఎంతటి చుండ్రు అయినా సరే పోతుంది..!

March 21, 2022 9:04 AM

Dandruff : ప్రస్తుత తరుణంలో చాలా మంది చుండ్రు సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నో షాంపూలను ట్రై చేశాం కానీ సమస్య తగ్గడం లేదని కొందరు విచారిస్తున్నారు. అయితే ఈ రకమైన చుండ్రు సమస్య నుంచి బయట పడేందుకు ఓ అద్భుతమైన చిట్కా ఉంది. అందుకు ఏం చేయాలంటే..

use the natural remedy to remove Dandruff
Dandruff

కొన్ని తులసి ఆకులను తీసుకుని అందులో రెండు టీస్పూన్ల ఉసిరికాయ పొడి కలిపి, కొద్దిగా నీళ్లు పోసి పేస్టులా చేసుకోవాలి. ఈ పేస్టును తలకు బాగా పట్టించాలి. జుట్టు కుదుళ్లకు తగిలేలా ఈ పేస్ట్‌ను బాగా రాయాలి. తరువాత అరగంట పాటు అలాగే ఉండాలి. అనంతరం తలస్నానం చేసేయాలి.

ఇలా వారంలో రెండు సార్లు చేస్తే చాలు.. చుండ్రు సమస్య మొత్తం తగ్గిపోతుంది. చుండ్రు పూర్తిగా పోయే వరకు ఇలా చేయవచ్చు. దీంతో జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుంది. దృఢంగా మారుతుంది. జుట్టు రాలడం తగ్గుతుంది. ఉసిరి, తులసిలలో ఉండే గుణాలు జుట్టు సమస్యలను పూర్తిగా తగ్గించేస్తాయి. అందుకనే చుండ్రు మొత్తం పోతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now