Upasana : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి కొణిదెల ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఓ వైపు ఇంటి బాధ్యతలను చూస్తూనే మరోవైపు అపోలో హాస్పిటల్స్ బాధ్యతలను కూడా నెరవేరుస్తోంది. అంతేకాకుండా అప్పుడప్పుడూ సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ఈమె పాల్గొంటోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సుమారు 200 అనాథ, వృద్ధాశ్రమాలకు ఈమె సహాయం చేస్తోంది. అలాగే నెహ్రూ జూపార్క్‌లో పలు వన్యప్రాణులను ఈమె దత్తత తీసుకుని వాటి సంరక్షణ బాధ్యతలను చేపడుతోంది. ఇలా మెగా కోడలిగా ఉపాసన ఎంతో పేరు తెచ్చుకుంది. అందుకనే ఆమె అంటే చాలా మంది అభిమానిస్తుంటారు.
ఇక ఈ మధ్యే ప్రముఖ ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఉపాసన పాల్గొనగా అందులో ఆమె పెళ్లిళ్లు, సంబంధాలు, పిల్లలపై ఆయనను ప్రశ్నలు అడిగింది. తనను చాలా మంది ఇంకా పిల్లల్ని ఎందుకు కనలేదని అడుగుతున్నారని.. దీనికి ఏమని సమాధానం చెప్పాలని ఆమె అడగ్గా.. పిల్లల్ని కనలేందుకు బాధపడొద్దు. మీరు 10 ఏళ్లు అవుతున్నా.. పిల్లల్ని కనడం లేదంటే.. అందుకు మీకు సన్మానం చేయాలి.. అంటూ సద్గురు తెలిపారు. అయితే ఉపాసన ఈ ప్రశ్న అడగడం ఏమోగానీ.. త్వరలోనే ఈ దంపతులు పిల్లల్ని కనబోతున్నారంటూ ప్రచారం జరిగింది. దీంతో మెగా అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.
అయితే 10 ఏళ్ల పాటు ఉపాసన దంపతులు పిల్లల్ని కనకపోవడం వెనుక ఆమె తాత ప్రతాప్ రెడ్డికి ఆమె ఇచ్చిన మాటనే కారణమని తెలుస్తోంది. పెళ్లయ్యాక వెంటనే పిల్లల్ని కనబోనని.. 10 ఏళ్ల పాటు సామాజిక సేవా కార్యక్రమాలు చేయడంతోపాటు తాను అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు కష్టపడతానని.. అప్పటి వరకు పిల్లల్ని కననని ఆమె ప్రతాప్ రెడ్డికి మాట ఇచ్చిందట. అయితే ఈ ఏడాదితో చరణ్ దంపతులు 10 వసంతాలను పూర్తి చేసుకున్నారు. దీంతో ఇక ఉపాసన పిల్లల్ని కంటుందనే అంటున్నారు. కనుకనే మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి వీరు తీపి కబురు ఎప్పుడు చెబుతారో చూడాలి.
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…