Upasana : మెగా కోడలు ఉపాసన ఈమధ్య కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈమె ఇటీవలే కరోనా బారిన పడి కోలుకున్నానని చెప్పి అందరికీ షాకిచ్చారు. అయితే టెస్ట్ చేయించుకుంటేనే గానీ అసలు విషయం బయట పడలేదని.. తనకు కోవిడ్ లక్షణాలు స్వల్పంగానే ఉన్నందున అసలు ఆ విషయం తెలియలేదని ఆమె స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం తాను కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నానని అన్నారు. అయితే ఉపాసన తాజాగా ఓ లగ్జరీ కారును కొనుగోలు చేశారు. అందులో షికారు చేస్తూ తీసుకున్న వీడియోను ఆమె షేర్ చేశారు.
మెగా కోడలు ఉపాసన కొణిదెల తాజాగా ఆడి కంపెనీకి చెందిన ఆడి ఇ ట్రాన్ అనే కారును కొన్నారు. ఇది విద్యుత్ వాహనం. ధర రూ.1.10 కోట్ల నుంచి ప్రారంభం అవుతుంది. ఈ క్రమంలోనే ఈకారును కొన్న ఆమె అందులో ప్రయాణించిన అనుభూతి గురించి వివరించారు.
ఆడి ఇ ట్రాన్ కారు చాలా అద్భుతంగా ఉందని ఉపాసన పేర్కొన్నారు. ఇది లగ్జరీని, సుస్థిరతను అందిస్తుందని, చక్కని ఆవిష్కరణను ఆడి అందించిందని, చాలా సౌకర్యవంతంగా కూడా ఈ కారు ఉందని ఆమె తెలిపారు. ఈమేరకు ఆమె ఈ విషయం గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టారు. ఈ కారు తన ప్రయాణాలకు అనువుగా ఉంటుందని తెలిపారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…