Allu Arjun : బ‌న్నీ ఇప్పుడు.. నంద‌మూరి అల్లు అర్జున్‌..!

Allu Arjun : అల్లు అర్జున్ మొద‌టి నుంచి వివాద ర‌హితుడు. త‌న సినిమాలు ఏవో తాను తీసుకుని త‌న మార్గంలో తాను వెళ్తుంటాడు. ఎవ‌రినీ కించ ప‌రిచేలా మాట్లాడ‌డు. మెగా కుటుంబం నుంచి వ‌చ్చినా అల్లు అర్జున్ త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును సొంతం చేసుకున్నాడు. ఈ క్ర‌మంలోనే మెగా ఫ్యాన్స్ ఎలాగో అల్లు ఫ్యాన్స్ కూడా అలాగే ఏర్ప‌డ్డారు. అయితే ఇటీవ‌లి కాలంలో చోటు చేసుకున్న ప‌లు సంఘ‌ట‌న‌ల కార‌ణంగా మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్‌ను విమ‌ర్శిస్తున్నారు. దీంతో బ‌న్నీ ఫ్యాన్స్ కూడా అంతే ఘాటుగా ప్ర‌తి విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే..

ఇటీవ‌లే విజ‌య‌వాడ‌లో చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేష‌న్ ఆలిండియా సంఘం ఆధ్వ‌ర్యంలో ఓ మీటింగ్ నిర్వ‌హించారు. అందులో మెగా ఫ్యాన్స్ హాజ‌రై ప‌వ‌న్ భ‌విష్య‌త్తు రాజ‌కీయ ప్ర‌ణాళిక‌ల‌పై చ‌ర్చించారు. ప‌వ‌న్‌ను వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా స‌రే సీఎంగా చూడాల‌ని వారు తీర్మానించారు. అయితే ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా స్టేజిపై ఏర్పాటు చేసిన ఫొటోలో చిరంజీవి, నాగబాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్, రామ్ చ‌ర‌ణ్‌ల ఫొటోలు ఉన్నాయి. కానీ బ‌న్నీ ఫొటో లేదు. దీంతో అల్లు అర్జున్‌కు, మెగా కాంపౌండ్‌కు మ‌ధ్య దూరం పెరిగింద‌నే వార్త‌లకు మ‌రింత బ‌లం చేకూరిన‌ట్లు అయింది. ఇక ఈ విష‌యంలో బ‌న్నీ ఫ్యాన్స్‌, మెగా ఫ్యాన్స్ మధ్య గొడ‌వ‌లు కూడా ప్రారంభం అయ్యాయి. అయితే ఆశ్చ‌ర్య‌క‌రంగా ఈ వివాదంలోకి నంద‌మూరి ఫ్యాన్స్ ఎంట‌ర్ అయ్యారు.

Allu Arjun

అల్లు అర్జున్ అంటే నంద‌మూరి ఫ్యాన్స్‌కు ఇప్ప‌టికే ఎంతో గౌర‌వం ఏర్ప‌డింది. అఖండ ఈవెంట్‌లో కావ‌చ్చు.. అంత‌కు ముందు టెలికాస్ట్ అయిన అన్‌స్టాప‌బుల్ షో కావ‌చ్చు.. అల్లు అర్జున్ నంద‌మూరి ఫ్యామిలీకి బాగా ద‌గ్గ‌ర‌య్యాడు. దీంతో బ‌న్నీని నంద‌మూరి ఫ్యాన్స్ త‌మ సొంత మ‌నిషిలా భావిస్తూ వ‌స్తున్నారు. అలాగే బ‌న్నీ పుష్ప సినిమాకు కూడా వారు స‌పోర్ట్‌గా ఉన్నారు. ఇలా ప్ర‌తి సంద‌ర్భంలోనూ బ‌న్నీకి నంద‌మూరి ఫ్యాన్స్ మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు. అయితే ఆశ్చ‌ర్య‌క‌రంగా తాజాగా మెగా ఫ్యాన్స్‌కు, బ‌న్నీ ఫ్యాన్స్‌కు మ‌ధ్య జ‌రుగుతున్న గొడ‌వ‌లో నంద‌మూరి ఫ్యాన్స్ ఎంట‌ర‌య్యారు. వారు బ‌న్నీ ఫ్యాన్స్‌కు స‌పోర్ట్‌గా నిలిచారు. దీంతో ఫ్యాన్స్ మ‌ధ్య వార్ ముదిరి పాకాన ప‌డుతోంది. ఈ క్ర‌మంలో బ‌న్నీ ఫ్యాన్స్‌, నంద‌మూరి ఫ్యాన్స్ ఒక‌వైపు.. మెగా ఫ్యాన్స్ ఒక‌వైపు చేరి ట్విట్ట‌ర్‌లో, ఇత‌ర సోష‌ల్ మీడియా వేదిక‌ల‌పై మాట‌ల యుద్ధం కొన‌సాగిస్తున్నారు. అయితే ఇది ఎంత వ‌ర‌కు వెళ్తుందో చూడాలి.

ఇక బ‌న్నీని త‌మ సొంత మ‌నిషిలా భావిస్తున్న నంద‌మూరి ఫ్యాన్స్‌.. ఇప్పుడు ఆయ‌నకు ఒక ట్యాగ్ కూడా త‌గిలించారు. బ‌న్నీ ఇప్పుడు నంద‌మూరి అల్లు అర్జున్ అని అంటున్నారు. ఈ క్ర‌మంలోనే ఈ వార్త సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌నీయాంశంగా మారి వైర‌ల్ అవుతోంది. ఇక ఇది ఎంత వ‌ర‌కు వెళ్తుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

‘ధురంధర్ 2’పై రమ్య స్పందన ఫైర్.. థియేటర్లో టైమ్ వేస్ట్ అంటూ సంచలన వ్యాఖ్యలు!

నటి రమ్య‌ స్పందన త‌న సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ 2…

Sunday, 22 March 2026, 12:56 PM

స్పూన్లు వద్దు.. చేత్తో తింటేనే ఆ మజా! అక్షయ్ కుమార్ డైట్ సీక్రెట్ వైరల్..

ఆరోగ్య‌క‌ర‌మైన జీవ‌న‌శైలిని పాటించ‌డ‌మే కాకుండా, రోజూ క‌ఠిన డైట్‌, వ్యాయామ నియ‌మాల‌ను పాటించ‌డంలో బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ ఎల్ల‌ప్పుడూ…

Saturday, 21 March 2026, 6:09 PM

సల్మాన్ ఖాన్ నా పట్ల ఎంతో సహనంతో ఉన్నారు.. ‘లక్కీ’ జ్ఞాపకాలను పంచుకున్న స్నేహ ఉల్లాల్!

అప్ప‌ట్లో బాలీవుడ్ న‌టుడు స‌ల్మాన్‌ఖాన్‌తో క‌లిసి ల‌క్కీ సినిమా చేసిన స‌మ‌యంలో చిత్ర షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు ఆయ‌న త‌న ప‌ట్ల…

Friday, 20 March 2026, 9:29 PM

రష్మికకు ‘గద్దర్’ అవార్డు.. రేవంత్ రెడ్డి, రామ్ చరణ్ చేతుల మీదుగా! ట్రోల్స్‌కు అదిరిపోయే రిటార్ట్.

టాలీవుడ్ న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను ఇటీవ‌లే వివాహం చేసుకున్న క‌న్న‌డ న‌టి ర‌ష్మిక మంద‌న్న‌కుతెలంగాణ గద్ద‌ర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…

Friday, 20 March 2026, 7:49 PM

ఆ డాక్టర్లు డబ్బులిస్తామన్నా వద్దన్నా.. అనుపమ్ ఖేర్ ‘బట్టతల’ వెనుక అసలు రహస్యం!

హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ డాక్ట‌ర్లు త‌న‌కు డ‌బ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నార‌ని, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాల‌ని త‌ర‌చూ…

Thursday, 19 March 2026, 10:23 PM

చదువులో 80 రాలేదు.. కానీ కెప్టెన్‌గా 80% సక్సెస్! సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు.

స్కూల్‌, కాలేజీల్లో చ‌దివిన‌ప్పుడు ఎన్న‌డూ 80 శాతం మార్కుల‌ను దాట‌లేక‌పోయాన‌ని, కానీ భార‌త టీ20 జ‌ట్టు కెప్టెన్‌గా 80 శాతానికి…

Thursday, 19 March 2026, 6:36 PM

అనుష్క పెళ్లి వార్తలపై టీమ్ సీరియస్.. ఆ వార్తల్లో నిజం లేదు! ప్రచారం ఆపండి..

తాను పెళ్లి చేసుకోబోతున్నాన‌ని మీడియాతోపాటు సామాజిక మాధ్య‌మాల్లో వ్యాప్తి చెందుతున్న వార్త‌ల‌ను న‌టి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేర‌కు…

Thursday, 19 March 2026, 3:38 PM

అందుకే బాలీవుడ్‌ను వదిలేశా.. హాలీవుడ్ వెనుక అసలు నిజం చెప్పిన ప్రియాంక చోప్రా!

భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయ‌ని, హాలీవుడ్‌లో సినిమాల విష‌యంలో ఎలాంటి ప‌రిమితులు ఉండ‌వ‌ని, అందుక‌నే అక్క‌డ…

Thursday, 19 March 2026, 11:09 AM