Upasana : దుబాయ్‌లో క్రిస్మ‌స్ సెల‌బ్రేష‌న్స్ జ‌రుపుకున్న ఉపాస‌న‌, న‌మ్రత

December 25, 2021 9:49 PM

Upasana : టాలీవుడ్‌లో హీరోల మ‌ధ్య ఎంత సాన్నిహిత్యం ఏర్ప‌డిందో మ‌నం చూస్తూనే ఉన్నాం. కుర్ర హీరోల‌తోపాటు సీనియ‌ర్ హీరోలు కూడా ప‌లు సంద‌ర్భాల‌లో క‌లుస్తూ అభిమానుల‌కి మంచి వినోదాన్ని పంచుతున్నారు. ప‌లు ఈవెంట్స్‌లో వీరు సంద‌డి చేస్తూ వాటికి సంబంధించిన ఫొటోలను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ వ‌స్తున్నారు. తాజాగా ‘దుబాయ్‌ ఎక్స్‌పో 2020’లో భాగంగా దుబాయ్‌కి వెళ్లారు ఉపాస‌న, న‌మ్ర‌త‌.

Upasana and namrata celebrated christmas in dubai

దుబాయ్‌లో వీరంద‌రూ క్రిస్మ‌స్ సెల‌బ్రేష‌న్స్ జ‌రుపుకోగా, ఆ త‌ర్వాత నమ్రత, ఆమె సోదరి శిల్పా, మనీశ్‌ మల్హోత్ర తదితరులకు ఉపాసన ప్రత్యేకంగా విందు ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆమె ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు. ‘‘ఇష్టమైన స్నేహితులతో రుచికరమైన భోజనం. నాకెంతో ఇష్టమైనవారితో దుబాయ్‌లో ఈ మధ్యాహ్నం సరదాగా గడిచింది. ఉపాసన.. అద్భుతమైన వంటకాలతో నీలా విందు ఎవ్వరూ ఇవ్వలేరు.

మనీశ్‌.. ఈ రోజు నిన్ను ఇక్కడ కలుసుకోవడం ఆనందంగా ఉంది. ఇలాంటి వేడుకలే త్వరలో హైదరాబాద్‌లో మనందరం కలిసి జరుపుకోవాలని ఆశిస్తున్నాను. అందరికీ హ్యాపీ క్రిస్మస్‌’’ అని నమ్రత పోస్ట్ పెట్టింది. దీనికి స్పందించిన ఉపాస‌న‌.. ‘‘సమయం ఎంతో సరదాగా గడిచిపోయింది. అతి త్వరలోనే మనం మళ్లీ హైదరాబాద్‌లో ఇలాగే కలుసుకోవాలి’’ అని రిప్లై ఇచ్చింది. ప్ర‌స్తుతం వీరి ఫొటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment