Under 19 Cricket World Cup 2022 : భారత యువ క్రికెట్ ప్లేయర్ల సత్తా మరోమారు ప్రపంచానికి తెలిసింది. ఐసీసీ టోర్నీల్లో ఆధిపత్యం చెలాయించగలమని మరోమారు భారత జట్టు నిరూపించింది. ఇంగ్లండ్‌తో జరిగిన అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో జయభేరిని మోగించింది. మరోమారు యువ జట్టు భారత క్రికెట్ ఖ్యాతిని నలుదిశలా వ్యాప్తి చేసింది.
భారత్, ఇంగ్లండ్‌ల మధ్య జరిగిన అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో.. ఇంగ్లండ్‌పై భారత్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇంగ్లండ్ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని భారత్ నెమ్మదిగా ఆచి తూచి ఆడుతూ ఛేదించింది. దీంతో మరోమారు అండర్ 19 టీమ్ వరల్డ్ కప్‌ను గెలుచుకుంది. ఇది భారత్ అండర్ 19 జట్టుకు వరుసగా 5వ టైటిల్ కావడం విశేషం.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ అండర్ 19 జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లు కూడా ఆడలేదు. 44.5 ఓవర్లలోనే ఆలౌట్ అయింది. 189 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్‌లలో జేమ్స్ రో (95) మినహా ఎవరూ ఆకట్టుకునే ప్రదర్శన చేయలేదు. ఇక భారత అండర్ 19 జట్టు బౌలర్లలో రాజ్ బవా ఏకంగా 5 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ అండర్ 19 జట్టు పతనాన్ని శాసించాడు. అలాగే మరో బౌలర్ రవికుమార్ 4 వికెట్లు తీశాడు. కౌశల్ తంబెకు 1 వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ 47.4 ఓవర్లలో 6 వికెట్లను కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 195 పరుగులు చేసింది. భారత బ్యాట్స్‌మెన్‌లలో షేక్ రషీద్ 50, నిశాంత్ సంధు 50, రాజ్ బవా 35 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోషువా బోయ్‌డెన్, జేమ్స్ సేల్స్, థామస్ ఆస్పిన్ వాల్‌లకు తలా 2 వికెట్లు దక్కాయి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…