మహిళలపై రోజూ అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్నో చట్టాలు వచ్చినప్పటికీ రోజురోజుకూ ఆగడాలు అధికమయ్యాయని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే అక్టోబర్ 3వ తేదీన ఢిల్లీలో తన పనులను ముగించుకుని ముంబై వెళ్తున్న తనపై ఓ బిజినెస్ మ్యాన్ లైంగిక దాడికి ప్రయత్నించాడు.. అంటూ ఓ నటి ఆరోపించింది.
తన పేరును చెప్పడానికి నిరాకరించిన టీవీ నటి అక్టోబర్ 3వ తేదీన ఢిల్లీ నుంచి ముంబైకి వెళ్లగా రాత్రి 11 గంటల సమయంలో ఫ్లైట్‌లో ముంబైలో ల్యాండ్ అయింది. ఈ క్రమంలోనే ప్రయాణికులు దిగడానికి లేచి నిలబడగా గజియాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త వచ్చి తన పక్క సీట్లో కూర్చున్నాడు. అయితే తను దిగడానికి వెళ్తున్న సమయంలో ఆ వ్యాపారవేత్త వెనక నుంచి తన నడుముని గట్టిగా పట్టుకోవడమే కాకుండా లాగి తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు.. అంటూ ఆరోపణలు చేసింది.
ఒక్కసారిగా ఆ వ్యాపారవేత్త అలా చేయడంతో ఎంతో షాక్ అయ్యి గట్టిగా కేకలు వేసింది. అయితే అతను అక్కడ ఉన్నది మగ ప్యాసింజర్ అనుకున్నాడట. అందుకనే అలా ప్రవర్తించానని అతను చెప్పాడు. అయితే అలా ప్రవర్తించినందుకు అతను క్షమాపణలు చెప్పాడని.. అది చూసి తనకు ఎంతో ఆశ్చర్యం వేసిందని.. ఈ సందర్భంగా నటి తెలిపింది. ఈ క్రమంలోనే ఆ నటి సదరు వ్యాపారవేత్తపై ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆ వ్యాపారవేత్తను కస్టడీలోకి తీసుకున్నారు.
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…
భారత్, శ్రీలంకలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరగనున్న టీ20 వరల్డ్‌కప్ 2026 జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై భారత…