Tollywood : అఘోరా పాత్రల్లో క‌నిపించి భ‌య‌పెట్టించిన తెలుగు స్టార్స్ ఎవ‌రో తెలుసా?

October 22, 2021 2:17 PM

Tollywood : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటీనటులు తమ కెరీర్ ను మరో స్థాయికి చేర్చేందుకు ఎన్నో ప్రయోగాలు చేయడంలో ముందుంటారు. విలక్షణమైన పాత్రల్లో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలాంటి వైవిధ్యభరితమైన పాత్రల్లో నటించిన తెలుగు నటులు ఎవరో ఇప్పుడు చూద్దాం. లేటెస్ట్ గా బాలకృష్ణ హీరోగా వస్తున్న సినిమా అఖండ. ఈ సినిమాలో బాలకృష్ణ అఘోరాగా నటిస్తున్నారు. ఈ పాత్రకు సంబంధించిన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే హిట్ సినిమాతో హిట్ సాధించిన విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న లేటెస్ట్ సినిమా గామీ.

Tollywood these are the stars who did aghora roles in movies

ఈ సినిమాలో కూడా విశ్వక్ అఘోర పాత్రలో కనిపిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. డిఫరెంట్ కంటెంట్ తో వస్తున్న విశ్వక్ సేన్ ప్రేక్షకుల్ని అలరించడం ఖాయం అంటున్నాయి సినీ వర్గాలు. టాలీవుడ్ మెగా హీరో చిరంజీవి కూడా గతంలో శ్రీమంజునాథ సినిమాలో కొన్ని సీన్స్ లో అఘోరాగా ఎంటర్ టైన్ చేశారు. అక్కినేని నాగర్జున ఢమరుకం సినిమాలో అఘోరాగా కనిపించి మెస్మరైజ్ చేశారు.

అలాగే మెగా బ్రదర్ నాగాబాబు కూడా అఘోరా అనే సినిమాలో అఘోరాగా కనిపించారు. ఇప్పుడు లేటెస్ట్ గా మంచు మనోజ్ అహం బ్రహ్మస్మీ అనే మూవీలో అఘోరాగా కనిపిస్తున్నట్లు సమాచారం. అఘోరా పాత్రల్లో కాకపోయినా టాలీవుడ్ హీరోలు డీ గ్లామర్ రోల్స్ కూడా నటిస్తున్నారు. స్టార్ హీరోయిన్లు సైతం వినూత్నమైన పాత్రల్లో నటిస్తూ.. ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now