Tollywood : లేడీలందు ఈ కిలేడీ వేరయా అనే చెప్పాలి. ముగ్గురు టాలీవుడ్ హీరోలని మోసం చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె పేరు శిల్పా చౌదరి. టాలీవుడ్ హీరోలను బోల్తా కొట్టించిన వ్యాపారవేత్త, సినీ నిర్మాత శిల్పా చౌదరిని పోలీసులు అరెస్టు చేశారు. చీటింగ్ కేసులో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు టాలీవుడ్ హీరోలు ఈమె వలన మోసపోయినట్టు తెలుస్తోంది.
ప్రముఖుల పేర్లు చెప్పి మరీ శిల్ప మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. సుమారుగా రూ.200 కోట్ల వరకు వసూళ్ల పేరుతో కుచ్చు టోపీ పెట్టినట్లు తెలుస్తోంది. శిల్పకు సంబంధించి పోలీసులకి పలు కంప్లైంట్స్ వస్తున్న నేపథ్యంలో పోలీసులు విచారణ చేపట్టి అరెస్ట్ చేశారు. తాము మోసపోయామంటూ ప్రముఖులు, సినీ సెలబ్రెటీలు వరసగా పోలీసు స్టేషన్‌కు క్యూ కట్టడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పేజ్ త్రీ పార్టీలో ప్రముఖుల పేర్లు చెప్పి అధిక వడ్డీకి ఇప్పిస్తానంటూ శిల్ప రూ.వందల కోట్లు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.
శిల్పతో పాటు ఆమె భర్తను కూడా పోలీసులు విచారిస్తున్నారు. అనేక విషయాలపై ఆరాలు తీస్తూ కూపీ లాగే ప్రయత్నం చేస్తున్నారు. శిల్ప మోసం చేసిన వారిలో టాలీవుడ్ హీరోలతోపాటు వ్యాపారవేత్తలు, లాయర్లు, ఫైనాన్షియర్లు ఉన్నట్లు తెలుస్తోంది. సుమారుగా రూ.100 కోట్ల నుంచి రూ.200 కోట్ల మేర వారికి కుచ్చు టోపీ పెట్టిన శిల్ప చాలా మంది ప్రముఖుల్ని మోసం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అధిక వడ్డీ ఇస్తానని చెప్పి శిల్ప రూ.కోట్లు వసూలు చేసింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…