Tollywood : ముగ్గురు టాలీవుడ్ హీరోల‌ని మోసం చేసిన కిలేడీ..!

November 27, 2021 2:53 PM

Tollywood : లేడీలందు ఈ కిలేడీ వేర‌యా అనే చెప్పాలి. ముగ్గురు టాలీవుడ్ హీరోల‌ని మోసం చేసి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఆమె పేరు శిల్పా చౌద‌రి. టాలీవుడ్ హీరోల‌ను బోల్తా కొట్టించిన వ్యాపార‌వేత్త, సినీ నిర్మాత శిల్పా చౌద‌రిని పోలీసులు అరెస్టు చేశారు. చీటింగ్ కేసులో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు టాలీవుడ్ హీరోలు ఈమె వ‌ల‌న మోస‌పోయిన‌ట్టు తెలుస్తోంది.

Tollywood : ముగ్గురు టాలీవుడ్ హీరోల‌ని మోసం చేసిన కిలేడీ..!
Tollywood

ప్ర‌ముఖుల పేర్లు చెప్పి మ‌రీ శిల్ప మోసాల‌కు పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. సుమారుగా రూ.200 కోట్ల వ‌ర‌కు వ‌సూళ్ల పేరుతో కుచ్చు టోపీ పెట్టిన‌ట్లు తెలుస్తోంది. శిల్పకు సంబంధించి పోలీసుల‌కి ప‌లు కంప్లైంట్స్ వ‌స్తున్న నేప‌థ్యంలో పోలీసులు విచార‌ణ చేపట్టి అరెస్ట్ చేశారు. తాము మోసపోయామంటూ ప్రముఖులు, సినీ సెలబ్రెటీలు వరసగా పోలీసు స్టేషన్‌కు క్యూ కట్టడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పేజ్‌ త్రీ పార్టీలో ప్రముఖుల పేర్లు చెప్పి అధిక వడ్డీకి ఇప్పిస్తానంటూ శిల్ప రూ.వందల కోట్లు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.

శిల్పతో పాటు ఆమె భ‌ర్త‌ను కూడా పోలీసులు విచారిస్తున్నారు. అనేక విష‌యాల‌పై ఆరాలు తీస్తూ కూపీ లాగే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. శిల్ప మోసం చేసిన వారిలో టాలీవుడ్‌ హీరోలతోపాటు వ్యాపారవేత్తలు, లాయర్లు, ఫైనాన్షియర్లు ఉన్నట్లు తెలుస్తోంది. సుమారుగా రూ.100 కోట్ల నుంచి రూ.200 కోట్ల మేర వారికి కుచ్చు టోపీ పెట్టిన శిల్ప చాలా మంది ప్రముఖుల్ని మోసం చేసిన‌ట్లు వార్త‌లు వస్తున్నాయి. అధిక వడ్డీ ఇస్తానని చెప్పి శిల్ప రూ.కోట్లు వసూలు చేసింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now