Tollywood : ఆఫ‌ర్ కావాలంటే క‌మిట్ మెంట్ అడుగుతున్నార‌ని బాధ వ్య‌క్త‌ప‌ర‌చిన హీరోయిన్..?

October 26, 2021 3:06 PM

Tollywood : హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు భాషతో సంబంధం లేకుండా అన్ని చిత్ర పరిశ్రమల్లోనూ మ‌హిళ‌లు లైంగిక వేధింపుల‌కి గుర‌వుతున్న విష‌యం తెలిసిందే. ఇటీవలి కాలంలో ఎంతో మంది నటీమణులు తమకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి మాట్లాడారు. కొంద‌రు దీనిపై పెద్ద ఎత్తున ఉద్య‌మాలు కూడా చేశారు. అయినా ప‌రిస్థితులు మార‌లేదు.

Tollywood one actress told her sadness with friends over commitment

తాజాగా ఓ వర్థమాన నటి కాస్టింగ్ కౌచ్ విష‌యంలో త‌న బాధ‌ను వ్య‌క్త‌ప‌రిచింది. ఆఫ‌ర్స్ గురించి అడిగితే క‌మిట్‌మెంట్ అడుగుతున్నారంటూ త‌న బాధ‌ను స్నేహితుల ద‌గ్గ‌ర వ్య‌క్త‌ప‌ర‌చింది. అందాల పోటీల్లో పాల్గొన్న ఆ హీరోయిన్ నటనలో శిక్షణ తీసుకొని ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టింది. ఓ చిన్న సినిమాతో టాలీవుడ్‌కి ప‌రిచ‌యం కాగా, అది డిజాస్టర్ అయినా ఆమె లుక్స్ కు మంచి పేరొచ్చింది.

ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా టూర్లు నిర్వహిస్తే, పక్కనున్న హీరో కంటే ఈమెపైనే మీడియా ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ఆ పాపులారిటీతో రెండో సినిమా ఆఫర్ వెంటనే వచ్చింది. అందులో పెద్ద హీరో. దీంతో ఆమెకు స‌మ‌స్య మొద‌లైంద‌ట‌. ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే కాస్త ”కో ఆపరేట్” చేయాలి అని చాలామంది వేధిస్తున్నార‌ని.. ఆ నటి త‌న ఫ్రెండ్స్ ద‌గ్గ‌ర చెప్పుకొని బాధ‌ప‌డుతోంద‌ట‌.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now