Tollywood : ఈ వారం థియేటర్స్, ఓటీటీలో ఇన్ని సినిమాలు రిలీజ్ కానున్నాయా..!

October 25, 2021 4:04 PM

Tollywood : టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలంటే ఇష్టపడనివాళ్ళుండరు. రిలీజ్ అయ్యేది చిన్న సినిమానా.. స్టార్ హీరో సినిమానా.. అని ఆలోచించేది పక్కన పెడితే కంటెంట్ ఉన్న సినిమాలను ఆదరిస్తుంటారు. ఇక ఎంటర్ టైన్ మెంట్ కి పక్కా అడ్రస్ సినిమానే. మరి అలాంటి సినిమాలు ఈవారంలో ఏవేం రిలీజ్ అవుతున్నాయో ఇప్పుడు చూద్దాం.

Tollywood movies that releasing this week in otts and theatres

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరీ, కేతికా శర్మ జంటగా నటిస్తున్న రొమాంటిక్ సినిమా ఈ నెల 29వ తేదీన రిలీజ్ అవుతోంది. ఈ సినిమాకి అనిల్ పాడూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ని చూస్తే అంచనాలు భారీగా ఉన్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం.

నెక్ట్స్ నాగశౌర్య, రీతూ వర్మ హీరోహీరోయిన్లు గా నటించిన వ‌రుడు కావ‌లెను సినిమా కూడా అదే రోజు రిలీజ్ అవుతోంది. ఈ సినిమా నుండి ఇప్పటి వరకు రిలీజ్ అయిన పోస్టర్లు, ట్రైలర్, లిరికల్ సాంగ్స్ పై మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో కీలకంగా మురళీ శర్మ, నదియాలు నటిస్తున్నారు.

అనిల్ ఇనమడు హీరోగా యాక్ట్ చేస్తూ డైరెక్షన్ వహించిన సినిమా తీరం. ఈ సినిమాను ప్రేమ, రొమాంటిక్ అంశాలతో తెరకెక్కించారు. తీరం సినిమాను ఈ నెల 29న విడుదల చేస్తున్నారు.

రావణ లంక.. సినిమా టైటిల్ తోనే ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసిన ఈ సినిమాలో క్రిష్ బండిపల్లి, అస్మిత కౌర్ లు నటిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాపై సోషల్ మీడియాలో మంచి టాక్ వినిపిస్తోంది. థియేటర్స్ తో పాటు ప్రముఖ ఓటీటీల్లో కూడా పలు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.

అమెజాన్ ప్రైమ్ లో 29న డైబుక్ స్ట్రీమ్ అవుతుంది. నెట్ ఫ్లిక్స్ లో హిప్నోటిక్, ఆర్మీ ఆఫ్ దీవ్స్ స్ట్రీమ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. నెక్ట్స్ జీ5లో 29వ తేదీన ఆఫత్ ఈ ఇష్క్ ప్లే అవనుంది. సోనీ లివ్ లో తెలుగు సినిమా ఫ్యామిలీ డ్రామా రిలీజ్ అవుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now