Samantha : సమంతని టాలీవుడ్ దూరం పెడుతోందా..?

October 24, 2021 11:26 PM

Samantha : టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఉన్న సమంత.. అక్కినేని నాగచైతన్యను వివాహం చేసుకుని ఎంతో సంతోషంగా గత నాలుగు సంవత్సరాల నుంచి తన వైవాహిక జీవితాన్ని గడిపింది. అయితే వీరిద్దరి మధ్య ఏ విధమైన మనస్పర్థలు వచ్చాయో ఎవరికీ తెలియదు కానీ వీరు విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. విడాకులని ప్రకటించినప్పటి నుంచి సోషల్ మీడియా వేదికగా సమంతను దారుణమైన కామెంట్లతో ట్రోల్ చేస్తున్నారు.

tollywood keeping Samantha away netizen rumors

సినిమా ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబానికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే సమంత నాగచైతన్య నుంచి విడిపోవడంతో అక్కినేని కుటుంబం నుంచి ఎలాంటి తప్పు ఉండదని.. పూర్తిగా సమంతదే తప్పు ఉండి ఉంటుందని అందరూ భావించారు. ఈ క్రమంలోనే ఆమె గురించి టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి మొదలుకొని సోషల్ మీడియా వరకు పాజిటివ్ గా కాకుండా నెగిటివ్ గా కామెంట్లు చేస్తున్నారు.

ఇలా తన గురించి ఇలాంటి నెగిటివ్ వార్తలను రాయడంతో విసుగుచెందిన సమంత సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. తనపై వస్తున్న అసత్య వార్తలను తీవ్రంగా ఖండించింది. అలాగే తన గురించి తప్పుడు ప్రచారాలు చేస్తున్నందుకుగాను ఆమె కొందరిపై పరువు నష్టం దావా కేసు వేసింది. అయితే విడాకుల తర్వాత సమంతకు బాలీవుడ్‌లో ఆఫర్లు రావడంతో ఆమె తెలుగు సినిమాలకు దూరం అవుతుందని.. ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇక అక్కినేని కుటుంబంతో టాలీవుడ్‌ ఇండస్ట్రీకి ఎంతో అనుబంధం ఉంది. అందువల్ల నాగచైతన్యకే టాలీవుడ్‌ సపోర్ట్‌ ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు. అదే వాస్తవం అయితే.. సమంతను టాలీవుడ్‌ దూరం పెడుతుందని.. కూడా అంటున్నారు. మరి ఇందులో నిజమెంత ఉన్నది.. అన్న విషయం తెలియాలంటే.. అందుకు కాలమే సమాధానం చెప్పాలి..!

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment