Tollywood : అధిక మొత్తంలో రెమ్యున‌రేష‌న్ ఆశించిన హీరోయిన్‌.. నిర్మాత‌లు ప‌క్క‌న పెట్టేశారు..?

November 12, 2021 9:55 AM

Tollywood : సాధార‌ణంగా సినిమా ఇండ‌స్ట్రీలో హీరోయిన్లు త‌మ‌కు క్రేజ్‌, పాపులారిటీ వ‌చ్చాక‌, సినిమాలు హిట్ అయ్యాక.. రెమ్యున‌రేష‌న్‌ను అమాంతం పెంచేస్తారు. ఇది స‌హ‌జ‌మే. అయితే అంత‌గా క్రేజ్ లేక‌పోయిన‌ప్ప‌టికీ.. ఓ అమ్మ‌డు మాత్రం నిర్మాత‌ల‌కు చుక్క‌లు చూపిస్తోంద‌ట‌. ఆ హీరోయిన్ బోల్డ్ పాత్ర‌ల్లో న‌టిస్తూ మంచి పేరే తెచ్చుకుంది. ఒక‌టి రెండు వెబ్ సిరీస్ లలోనూ న‌టించింది.

Tollywood actress demanded high remuneration producers replaced her

స‌ద‌రు హీరోయిన్ నిర్మాత‌ల‌కు కొత్త డిమాండ్లు పెడుతోంద‌ట‌. త‌న విలాసాల‌కు, ఖ‌ర్చుల‌కు అధిక మొత్తంలో రెమ్యున‌రేష‌న్ కావాల‌ని డిమాండ్ చేస్తోంద‌ట‌. దీంతో నిర్మాత‌లు ఆమెను మూవీలో తీసుకుందామ‌ని ప‌ట్టుబ‌ట్టిన‌ప్ప‌టికీ.. ఆవిడ ఇలా డిమాండ్లు చేస్తుండ‌డంతో వారు పున‌రాలోచిస్తున్నార‌ట‌. అయితే వారు ఆమె డిమాండ్ల‌కు ఒప్పుకుంటే అద‌నంగా రూ.50 ల‌క్ష‌లు ఇవ్వాల్సి వ‌స్తుంద‌ని లెక్క‌లు వేసుకుంటున్నార‌ట‌.

ఈ క్ర‌మంలోనే ఆ హీరోయిన్ క‌న్నా.. ఓ సీనియ‌ర్ హీరోయిన్ అయితే బెట‌ర‌ని నిర్మాత‌లు భావిస్తున్న‌ట్లు తెలిసింది. అందుక‌నే ఆ డిమాండింగ్ హీరోయిన్‌ను ప‌క్క‌న పెట్టి స‌ద‌రు సీనియ‌ర్ హీరోయిన్‌ను సినిమాకు అడిగార‌ట‌. దీంతో ఆమె ఓకే చెప్పిన‌ట్లు తెలుస్తోంది. ఇక ఈ విష‌యం తెలిసిన ఆ డిమాండింగ్ హీరోయిన్ ఆగ్ర‌హంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది.

ఓ సీనియ‌ర్ హీరో మూవీలో న‌టించేందుకు అన్ని కండిష‌న్లు పెట్టి అంత డిమాండ్ చేసిన ఆ హీరోయిన్‌కు ఇప్పుడు పెద్ద‌గా ఆఫ‌ర్లు లేన‌ప్ప‌టికీ అంత డిమాండ్ ఎలా చేస్తుంద‌ని ? చ‌ర్చించుకుంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now