Tiger Nageshwar Rao : ర‌వితేజ‌, బెల్లంకొండ శ్రీ‌నివాస్.. ఇద్ద‌రు చేస్తున్న‌దీ ఒక్క‌టే మూవీనా..? ఇదెక్క‌డి చోద్యం..?

Tiger Nageshwar Rao : బాల‌కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన ఎన్‌టీఆర్ బ‌యోపిక్ సినిమా గుర్తుంది క‌దా. ఆ మూవీ రెండు పార్ట్‌లుగా రిలీజ్ అయింది. ఒక‌టి ఎన్‌టీఆర్ సినిమాల గురించి కాగా.. ఇంకొక‌టి రాజ‌కీయాల గురించి ఉంటుంది. బాల‌కృష్ణ ఆ మూవీల్లో ఎన్‌టీఆర్ పాత్ర‌లో అద్భుతంగా న‌టించారు. అయితే అదే స‌మ‌యంలో వాస్త‌వాల‌ను చెబుతున్నాం.. అంటూ సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ.. ల‌క్ష్మీస్ ఎన్‌టీఆర్ పేరిట ఓ మూవీని తెర‌కెక్కించారు.

అయితే బాల‌కృష్ణ తీసిన రెండు సినిమాలు ఏమో గానీ.. వ‌ర్మ తీసిన సినిమాకే మంచి పాపులారిటీ ద‌క్కింద‌ని చెప్ప‌వ‌చ్చు. అయితే ఈ విధంగా ఒకే స‌మ‌యంలో ఒకే క‌థతో రెండు భిన్న సినిమాలు రావ‌డం అరుదుగా జ‌రుగుతుంటుంది. ఇక తాజాగా అలాంటి విచిత్ర‌మే జ‌రుగుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు.

స్టువ‌ర్ట్‌పురంలో ప్ర‌జ‌ల‌చే నాయ‌కుడిగా కీర్తించ‌బ‌డి.. పోలీసుల‌కు దొర‌క‌కుండా వారికి ముచ్చెమ‌ట‌లు పట్టించిన టైగ‌ర్ నాగేశ్వ‌ర్ రావు.. జీవిత చ‌రిత్ర‌తో మాస్ మ‌హ‌రాజ ర‌వితేజ ఓ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. అయితే ఆ మూవీని అనౌన్స్ చేసి ఒక్క రోజు కూడా కాక‌ముందే బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్ అదే టైగ‌ర్ నాగేశ్వ‌ర్ రావు బ‌యోపిక్ పేరిట ఇంకో మూవీని అనౌన్స్ చేశారు. ఆ మూవీని స్టూవ‌ర్ట్ పురం దొంగ పేరిట తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్ టైగ‌ర్ నాగేశ్వ‌ర్ రావు పాత్ర‌ను పోషించ‌నున్నాడు.

అయితే ఇలా ఒకే వ్య‌క్తి బ‌యోపిక్‌ను ఇద్ద‌రు హీరోలు రెండు వేర్వేరు సినిమాలుగా తీస్తుండడం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇద్ద‌రూ ఒక‌రికొక‌రు తెలియ‌కుండా మూవీల‌ను అనౌన్స్ చేశారా.. లేదైనా ఇంకేదైనా కార‌ణం ఉందా.. అన్న వివ‌రాలు తెలియ‌వు కానీ.. ఇద్ద‌రూ తీస్తున్న‌ది టైగ‌ర్ నాగేశ్వ‌ర్ రావు గురించే కావ‌డం విశేషం.

ఈ క్ర‌మంలోనే స్టూవ‌ర్ట్ పురం దొంగ‌లో బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ లుక్‌ను దీపావ‌ళి సంద‌ర్బంగా రివీల్ చేశారు. అందులో సాయిశ్రీ‌నివాస్ ఒదిగిపోయాడు. ఇక ర‌వితేజ లుక్‌ను కూడా రివీల్ చేయాల్సి ఉంది. మ‌రి క‌థ ఒకటే అయినా.. ఇద్ద‌రిలో ఎవ‌రి మూవీ ప్రేక్ష‌కుల‌ను ఎక్కువ‌గా అల‌రిస్తుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

రిస్క్ చేస్తేనే మంచి సినిమా.. ‘డెకాయిట్’ క్లైమాక్స్‌పై నిర్మాత సుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు!

మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేన‌ని నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీల‌క‌మ‌ని, ఇప్పుడు ప్రేక్ష‌కులు…

Tuesday, 14 April 2026, 7:27 PM

ఐపీఎల్ జట్టు ఎందుకు కొనలేదు? అసలు నిజం చెప్పిన అభిషేక్ బచ్చన్.. అంత బడ్జెట్ నా దగ్గర లేదు!

నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…

Tuesday, 14 April 2026, 5:35 PM

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి అంటే?

ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ…

Tuesday, 14 April 2026, 3:21 PM

పాత ఫ్లాపులని గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తే బాధగా ఉంటుంది.. కృతి శెట్టి ఎమోషనల్ కామెంట్స్!

తాను గ‌తంలో చేసిన సినిమాలు చాలా వ‌ర‌కు ఫ్లాప్ అయ్యాయి క‌నుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…

Saturday, 11 April 2026, 8:35 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్‌పై చిరంజీవి ఎమోషనల్.. పరిశ్రమకు ఇది పెద్ద దెబ్బ అంటూ ఆవేదన!

తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన‌ చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంట‌ర్నెట్‌లో…

Friday, 10 April 2026, 6:40 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్.. 5 నిమిషాల యాక్షన్ సీన్ నెట్టింట వైరల్! షాక్‌లో చిత్ర యూనిట్..

తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…

Friday, 10 April 2026, 12:43 PM

ప్రొపగాండా అంటే ఏంటి? ‘ధురంధర్ 2’ విమర్శకులపై సందీప్ రెడ్డి వంగా నిప్పులు!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధ‌ర్ 2 ది…

Thursday, 9 April 2026, 11:07 PM

‘కిల్లర్’ మిల్లర్ ఇప్పుడు విలన్ అయ్యాడా? డీసీ ఓటమిపై సునీల్ గవాస్కర్ సంచలన విశ్లేషణ..

ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…

Thursday, 9 April 2026, 9:01 PM