Anchor Suma : దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా కరోనా సృష్టించిన కలకలం అంతా ఇంతా కాదు. ఈ మహమ్మారి బారిన పడి ఎంతో మంది చనిపోయారు. ఎంతో మంది తమ కన్నవాళ్లను, కుటుంబ సభ్యులను, బంధువులను, స్నేహితులను కోల్పోయారు. కరోనా పేద, ధనిక అన్న తేడా లేకుండా అన్ని వర్గాలకు చెందిన ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేసింది.
సెలబ్రిటీలు కూడా అనేక మంది కరోనా కాటుకు బలయ్యారు. ఇక సీనియర్ నటి వరలక్ష్మి తన వాళ్లు కరోనా వల్ల ఎలా చనిపోయారో చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు. తాజాగా ఆమె క్యాష్ షోలో గెస్టుగా పాల్గొన్నారు. ఈ షో నవంబర్ 6 నుంచి ప్రసారం కానుంది. ఈ షోకు ఆమని, యమున, దివ్య వాణి, వరలక్ష్మి హాజరయ్యారు.
ఈ సందర్బంగా వరలక్ష్మి తన బాధను చెప్పుకుని కన్నీటి పర్యంతమయ్యారు. తన విషయాలను విన్న తోటి కంటెస్టెంట్లు, యాంకర్ సుమ.. సహా అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
కరోనా వల్ల తన ఫ్యామిలీలో ఏకంగా 5 మంది చనిపోయారిన వరలక్ష్మి కన్నీళ్లు పెట్టుకున్నారు. తన చెల్లెలు సరస్వతికి, ఆమె భర్తకు కరోనా వచ్చిందని, కానీ ఆయన చనిపోయారని, అయితే అదృష్టవశాత్తూ తన చెల్లెలు సరస్వతిని కష్టపడి బతికించుకున్నామని తెలిపారు. ఆ సమయంలో ఎవరూ దగ్గరకు వెళ్లలేని పరిస్థితి ఉందని, దీంతో తన చెల్లి ఒక్కతే ఆమె భర్త మృతదేహాన్ని మోసుకుంటూ వెళ్లిందని, ఈ కష్టం ఎవరికీ రాకూడదని అనిపించిందని వరలక్ష్మి కన్నీళ్లు పెట్టుకున్నారు. దీంతో అందరికీ ఆమె చెప్పిన విషయాలు కంటతడి పెట్టించాయి. కాగా ఈ షోకు చెందిన ప్రోమో వీడియో వైరల్‌గా మారింది.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్‌లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…