Shruti Haasan : రవితేజ సరసన క్రాక్ సినిమాలో నటించిన శృతి హాసన్‌కు బాలకృష్ణ పక్కన నటించే చాన్స్ వచ్చిందని గత కొద్ది రోజులుగా పుకార్లు షికార్లు చేశాయి. క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఒత్తిడి మేరకే శృతి హాసన్ బాలయ్య పక్కన నటించేందుకు ఒప్పుకుందని వార్తలు వచ్చాయి. ముందుగా ఆమె బాలయ్య పక్కన నటించేందుకు అంగీకరించలేదట. కానీ గోపీచంద్ మలినేని చొరవ వల్ల ఆమె బాలయ్య సినిమాకు ఓకే చెప్పిందట. అయితే ఈ వార్తలు నిజమే అయ్యాయి.
బాలకృష్ణ ఎన్‌బీకే 107 ప్రాజెక్టులో శృతి హాసన్ నటిస్తుందంటూ మైత్రి మూవీ మేకర్స్ దీపావళి సందర్భంగా ప్రకటన చేశారు. అయితే అంతా బాగానే ఉంది కానీ.. బాలయ్య సరసన శృతి హాసన్ నటించడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో చిత్ర యూనిట్‌ను, శృతి హాసన్‌ను అభిమానులు తెగ ట్రోల్ చేస్తున్నారు.
ఈ ప్రాజెక్టులో బాలయ్య సరసన శృతి హాసన్ ఏ పాత్రలో నటిస్తుంది ? కొంపదీసి బాలయ్యకు కూతురుగా నటించడం లేదు కదా.. ఇదేమి దిక్కుమాలిన కాంబినేషన్ రా బాబూ.. అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అయితే ఆమెను హీరోయిన్‌గా అనౌన్స్ చేసిన వెంటనే ఈ విధంగా ట్రోలింగ్ జరుగుతోంది. మరి సినిమా తీశాక అభిమానుల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.
బాలయ్య స్వతహాగా కోపంగానే ఉంటారు, కనుక ఆయన పక్కన చేసేందుకు శృతి మొదట భయపడిందట. కానీ దర్శకుడు గోపీచంద్ మలినేని సర్దిచెప్పడంతో ఆమె నటించేందుకు ఒప్పుకుందట. ఏది ఏమైనా.. బాలయ్య పక్కన శృతి హాసన్ అంటే.. ఇది వెరైటీ కాంబినేషన్ అని కొందరు నెటిజన్లు అంటున్నారు. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…