Anchor Suma : అంద‌రినీ ఏడిపించేసిన వ‌ర‌ల‌క్ష్మి.. ఆ స‌మ‌యంలో ఎంతో క‌ష్టం అనుభ‌వించామ‌ని క‌న్నీటి ప‌ర్యంతం..

November 4, 2021 10:54 PM

Anchor Suma : దేశంలోనే కాదు.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా సృష్టించిన క‌ల‌క‌లం అంతా ఇంతా కాదు. ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డి ఎంతో మంది చ‌నిపోయారు. ఎంతో మంది త‌మ క‌న్న‌వాళ్ల‌ను, కుటుంబ స‌భ్యుల‌ను, బంధువుల‌ను, స్నేహితుల‌ను కోల్పోయారు. క‌రోనా పేద‌, ధ‌నిక అన్న తేడా లేకుండా అన్ని వ‌ర్గాల‌కు చెందిన ప్ర‌జ‌ల జీవితాల‌ను అస్త‌వ్యస్తం చేసింది.

Anchor Suma cried for telling about vara lakhsmi in cash show

సెల‌బ్రిటీలు కూడా అనేక మంది క‌రోనా కాటుకు బ‌లయ్యారు. ఇక సీనియ‌ర్ న‌టి వ‌ర‌ల‌క్ష్మి త‌న వాళ్లు క‌రోనా వ‌ల్ల ఎలా చ‌నిపోయారో చెబుతూ క‌న్నీటి పర్యంత‌మ‌య్యారు. తాజాగా ఆమె క్యాష్ షోలో గెస్టుగా పాల్గొన్నారు. ఈ షో న‌వంబ‌ర్ 6 నుంచి ప్ర‌సారం కానుంది. ఈ షోకు ఆమ‌ని, యమున‌, దివ్య వాణి, వ‌ర‌ల‌క్ష్మి హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్బంగా వ‌ర‌ల‌క్ష్మి త‌న బాధ‌ను చెప్పుకుని క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు. త‌న విష‌యాల‌ను విన్న తోటి కంటెస్టెంట్లు, యాంక‌ర్ సుమ‌.. స‌హా అంద‌రూ క‌న్నీళ్లు పెట్టుకున్నారు.

క‌రోనా వ‌ల్ల త‌న ఫ్యామిలీలో ఏకంగా 5 మంది చ‌నిపోయారిన వ‌ర‌ల‌క్ష్మి క‌న్నీళ్లు పెట్టుకున్నారు. త‌న చెల్లెలు స‌ర‌స్వ‌తికి, ఆమె భ‌ర్త‌కు క‌రోనా వ‌చ్చింద‌ని, కానీ ఆయ‌న చ‌నిపోయార‌ని, అయితే అదృష్ట‌వ‌శాత్తూ త‌న చెల్లెలు స‌ర‌స్వ‌తిని క‌ష్ట‌ప‌డి బ‌తికించుకున్నామ‌ని తెలిపారు. ఆ స‌మ‌యంలో ఎవ‌రూ ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌లేని ప‌రిస్థితి ఉంద‌ని, దీంతో త‌న చెల్లి ఒక్క‌తే ఆమె భ‌ర్త మృత‌దేహాన్ని మోసుకుంటూ వెళ్లింద‌ని, ఈ క‌ష్టం ఎవ‌రికీ రాకూడ‌ద‌ని అనిపించింద‌ని వ‌ర‌ల‌క్ష్మి క‌న్నీళ్లు పెట్టుకున్నారు. దీంతో అంద‌రికీ ఆమె చెప్పిన విష‌యాలు కంట‌త‌డి పెట్టించాయి. కాగా ఈ షోకు చెందిన ప్రోమో వీడియో వైర‌ల్‌గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment