Pigeons : సాధారణంగా మనుషులకే కోట్ల రూపాయల ఆస్తి ఉంటుంది. కొందరు తాము పెంచుకునే జంతువులకు ఆస్తులను రాస్తుంటారు. అయితే పక్షులకు ఆస్తి ఉండడం ఎప్పుడైనా చూశారా ? లేదు కదా.. కానీ ఇప్పుడు చెప్పబోయేది వింటే.. నిజంగానే షాకవుతారు. అక్కడి పావురాళ్లకు కోట్ల రూపాయల ఆస్తి ఉంది. అయితే వాటిని ఏ ధనికుడో పెంచుకోరు. అవి అక్కడ స్వతంత్రంగానే జీవిస్తాయి. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
రాజస్థాన్‌లోని నగౌర్ జిల్లా జాస్‌నగర్ అనే చిన్న టౌన్‌లో అనేక పావురాళ్లు నివాసం ఉంటున్నాయి. వాటికి అక్కడి వారు కచ్చితంగా ఆహారం, నీరు ఇవ్వాల్సిందే. ఎందుకంటే అవి అక్కడ కోటీశ్వరురాళ్లు మరి. 4 దశాబ్దాల కిందట పారిశ్రామిక వేత్త సజ్జన్‌రాజ్ జైన్ ఆర్థిక సహకారంతో అక్కడి సర్పంచ్ రామ్‌దిన్ చోటియా, ఆయన గురువు మరుధర్ కేసరిలు పావురాళ్ల కోసం కబూతరన్ ట్రస్ట్ పేరిట ఓ ట్రస్ట్‌ను నెలకొల్పారు. ఈ ట్రస్ట్ కు అప్పట్లో విశేష ఆదరణ లభించింది. దీంతో ప్రజలు విరివిగా విరాళాలను అందజేశారు. దీంతో అక్కడి పావురాళ్ల సంఖ్య ఎక్కువైంది.
ఈ క్రమంలోనే వారు ఆ ట్రస్ట్‌కు వచ్చిన సొమ్ముతో గోశాలను ఏర్పాటు చేసి అందులో ఆవులను పెంచడం మొదలు పెట్టారు. క్రమ క్రమంగా దాంతో ఆదాయం వచ్చింది. అలాగే విరాళాలు కూడా వస్తూనే ఉన్నాయి. దీంతో స్థానికంగా 126 బిగాల భూమిని కొని అందులో 27 షాపులను ఏర్పాటు చేసి రెంట్‌కు ఇచ్చారు. వాటికి నెలకు రూ.80వేల వరకు ఆదాయం వస్తోంది.
అలా అలా ఆ ట్రస్ట్ పెద్దదైంది. ఈ క్రమంలోనే అక్కడి పావురాళ్లకు ఉన్న ఆస్తుల సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం అక్కడ 400 గోశాలలు ఉన్నాయి. 27 షాపుల ద్వారా ఆదాయం వస్తోంది. రూ.30 లక్షల మేర ఆ పావురాళ్లకు బ్యాంకు డిపాజిట్లు ఉన్నాయి. ఇలా వాటి సంఖ్య పెరగడంతోపాటు వాటి ఆదాయం, ఆస్తులు కూడా ఎప్పటికప్పుడు పెరుగుతూ వస్తున్నాయి. ఇక ఆ పావురాళ్లకు స్థానికులు కచ్చితంగా నీరు, ఆహారం ఇస్తారు. ఈ క్రమంలోనే ఆ పావురాళ్లకు వస్తున్న ఆదాయంతో అక్కడి గోశాలలను నిర్వహిస్తున్నారు. ఇలా ఆ పావురాళ్లు పాపులర్ అయ్యాయి. కోట్ల రూపాయల ఆస్తితో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…