Samantha : సమంత సోషల్ మీడియాకు అందుకే దూరంగా ఉంటుందా..? సైలెంట్ గా షాకివ్వ‌నుందా..?

August 29, 2022 2:55 PM

Samantha : ఏమాయ చేశావె సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది సమంత. ప్రస్తుతం సౌత్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. నార్త్ లో క్రమంగా సమంత క్రేజ్ పెరుగుతోంది. సోషల్‌ మీడియాలో సూపర్‌ యా​క్టివ్‌గా ఉండే హీరోయిన్స్‌లో సమంత ఒకరు. సినిమాకు సంబంధించిన విషయాలతోపాటు వ్యక్తిగత విషయాలను కూడా ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్‌ చేసుకుంటుందామె. ఫ్యామిలీ మ్యాన్ 2 తర్వాత సమంతకు బాలీవుడ్ లో కూడా అనేక అవకాశాలు వచ్చాయి. మరోవైపు పుష్పలో ఐటమ్ సాంగ్ ఊ.. అంటావా మావ.. అంటూ ఓ ఊపు ఊపేసింది స‌మంత‌.

టాలీవుడ్ లో స్టార్ కపుల్ గా ఉన్న సమంత, నాగ చైతన్య విడిపోయి ఫ్యాన్స్ కి ఒక్కసారిగా షాక్ ఇచ్చారు. డివోర్స్ అనంతరం స‌మంత వ్యక్తిగత ట్రోలింగ్ కి గురైంది. అయితే ఏమైందో ఏమో ఒక్కసారిగా ఆమె సోషల్ మీడియాకు గత కొంతకాలంగా దూరంగా ఉంటోంది. దానికి కారణం ఓ బాలీవుడ్ స్టార్ హీరో అంటూ వార్తలొచ్చాయి. సమంతకు క్లోజ్ ఫ్రెండ్ అయిన హీరో.. నీపై జనాల్లో నెగెటివ్ ఇంపాక్ట్ ఎక్కువ ఎక్కువవుతోంది. నువ్వు కొద్ది రోజుల పాటు సోషల్ మీడియాకి దూరంగా ఉండు.. అని సలహా ఇచ్చినట్లు సమాచారం. అందుకే సమంత సైలెంట్ అయినట్లు తెలుస్తోంది.

this may be the reason that Samantha staying away from social media
Samantha

కానీ ప్రస్తుతం మరో వార్త వైరల్ అవుతోంది. సమంత అదిరిపోయే ప్రాజెక్ట్ కు సైన్ చేసినట్లు తెలుస్తోంది. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న సమంత.. ఇప్పుడు అలాంటి వెబ్ సిరీస్ నే మరొకటి అంగీకరించినట్లు తెలుస్తోంది. ప్రియాంక చోప్రా మెయిన్ లీడ్ గా నటించిన సిట్టాల్‌ అనే అమెరికా వెబ్ సిరీస్ ను ఇండియన్ భాషల్లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.

బాలీవుడ్ హీరో వరుణ్ కి హీరోయిన్ గా సమంత ఎంపికైందట. ఈ వెబ్ సిరీస్ లో భారీ యాక్షన్స్ సన్నివేశాల కోసం ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటుందట. హీరో వరుణ్ ధావన్, సమంత ఇద్దరూ అమెరికాకు చెందిన స్టంట్ మాస్టర్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో శిక్షణ తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ లో సమంత భారీ యాక్షన్ స్టంట్స్ చేయనుంద‌ట. అందుకు ట్రైనింగ్ 2, 3 నెలలు ఉంటుందట. అయితే ఈ సిరీస్‌లో స‌మంత‌కు సంబంధించి ఎలాంటి సీన్స్ ఉంటాయోన‌ని అంద‌రూ ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు. మ‌రి స‌మంత స‌ర్‌ప్రైజ్ ఇస్తుందో లేదో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment