Nagarjuna : యువ సామ్రాట్‌గా పేరుగాంచిన అక్కినేని నాగార్జున గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఎన్నో సినిమాలతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఇద్దరు కొడుకులు ఉండి తాత అయ్యే వయస్సు ఆయనకు ఉన్నా.. ఆయన ఇంకా యువకుడిలానే కనిపిస్తుంటాడు. దీంతో నాగార్జునను అందరూ నవ మన్మథుడు అని పిలుస్తుంటారు. అయితే నాగార్జున మొదటి భార్య దగ్గుబాటి లక్ష్మి అన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ తరువాత ఆయన ఆమెకు విడాకులు ఇచ్చి అమలను చేసుకున్నారు. అయితే లక్ష్మితో ఆయన విడాకులు ఎందుకు తీసుకున్నారు.. అన్న విషయం చాలా మందికి తెలియదు. కానీ దీనికి బలమైన కారణమే ఉన్నట్లు తెలుస్తోంది.
అప్పట్లో దగ్గుబాటి రామానాయుడుకు, అక్కినేని నాగేశ్వర్ రావుకు మంచి ఫ్రెండ్ షిప్ ఉండేది. దీంతో రామానాయుడు తన కుమార్తె లక్ష్మిని నాగేశ్వర్ రావు కుమారుడు నాగార్జునకు ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నారు. అదే విషయాన్ని ఆయన ఏఎన్నార్‌కు చెప్పగా.. అందుకు ఆయన కూడా సరే అన్నారు. దీంతో అమెరికాలో ఉన్న లక్ష్మిని ఇండియాకు రప్పించారు. అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు. అయితే లక్ష్మికి వాస్తవానికి ఇండియాకు రావడం ఇష్టం లేదట. వివాహం అయినా అమెరికాలోనే ఉండాలని ఆమె కోరికట. ఈ క్రమంలోనే ఆమె ఇదే విషయాన్ని నాగార్జునకు చెప్పిందట.
అయితే నాగార్జున అప్పటికే తెలుగులో హీరోగా ఫుల్ సక్సెస్ బాటలో ఉన్నాడు. దీంతో ఆయన అమెరికా వెళ్లేందుకు ఇష్టపడలేదు. ఫలితంగా లక్ష్మి, నాగార్జున మధ్య గొడవలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలోనే వారు విడాకులు తీసుకున్నారు. అయితే విడాకులు అయ్యే సమయానికే వారికి చైతన్య జన్మించాడు. ఈ క్రమంలోనే చైతూ తల్లి దగ్గర చెన్నైలోనే పెరిగాడు. అయినప్పటికీ చైతూ సెలవులకు హైదరాబాద్‌కు వస్తుండేవాడు. దీంతో అప్పటికే వివాహం అయి ఉన్న అమల కుమారుడు అఖిల్‌తో కలిసి చైతూ సెలవుల్లో బాగా ఎంజాయ్ చేసేవాడు. తరువాత చెన్నైకి వెళ్లిపోయాడు. ఇక జోష్ మూవీ ద్వారా హీరోగా పరిచయం అయిన చైతూ అప్పటి నుంచి హైదరాబాద్‌లోనే ఉంటున్నాడు. ఆ తరువాత సమంతను చేసుకుని వేరే కాపురం పెట్టాడు. కానీ ఆమెకు విడాకులు ఇచ్చాక ఒక్కడే వేరే ఇంట్లో ఉంటున్నాడు. ఇలా లక్ష్మికి జరిగినట్లే చైతూను కూడా విడాకులు వెంటాడడం అందరినీ ఇప్పటికీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…