Vignesh Shivan : లేడీ సూపర్ స్టార్ నయనతార, దర్శకుడు విగ్నేష్ శివన్‌ల వివాహం ఈ మధ్యే జరిగిన విషయం విదితమే. వీరి వివాహం మహాబలిపురంలోని గ్రాండ్ షెరటాన్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రజనీకాంత్, షారూఖ్‌ఖాన్ వంటి దిగ్గజ నటీనటులు హాజరయ్యారు. పెళ్లి సందర్భంగా తమిళనాడు వ్యాప్తంగా ఈ జంట ఒక లక్ష మందికి అన్నదానం కూడా చేసి వార్తల్లో నిలిచారు. అయితే ఈ జంటకు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఊహించని షాకిచ్చింది. వీరి పెళ్లి ప్రసార హక్కులను సొంతం చేసుకున్న నెట్ ఫ్లిక్స్ ఆ హక్కులకు చెందిన ఒప్పందాన్ని రద్దు చేసుకుందట. దీంతో నయన్ దంపతులకు భారీగానే నష్టం వచ్చిందని అంటున్నారు.
తమ పెళ్లి ప్రసార హక్కులను నయన్, విగ్నేష్ దంపతులు నెట్ ఫ్లిక్స్‌కు రూ.25 కోట్లకు అమ్మినట్లు తెలిసింది. అయితే ఒప్పందం ప్రకారం నెల రోజుల వరకు వారు తమ పెళ్లి ఫొటోలు, వీడియోలను బయటకు లీక్ చేయరాదు. కానీ నయన్ దంపతులు రజనీకాంత్, షారూఖ్ ఖాన్‌ల ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది నెట్ ఫ్లిక్స్‌తో చేసుకున్న ఒప్పందానికి విరుద్ధం. కనుక నెట్ ఫ్లిక్స్ దీనిపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఆ డీల్‌ను రద్దు చేసుకుందట. దీంతో నయన్ దంపతులు నెట్ ఫ్లిక్స్‌తో చర్చలు జరుపుతున్నారట.
ముందుగా చేసుకున్న డీల్ ప్రకారం అయితే రూ.25 కోట్ల మేర నయన్ దంపతులకు నష్టం కలగనుంది. అయితే ఒప్పందాన్ని కాస్త తగ్గించి మళ్లీ డీల్ కుదుర్చుకునేలా వారు నెట్ ఫ్లిక్స్‌తో చర్చిస్తున్నారట. కానీ నెట్ ఫ్లిక్స్ మాత్రం అందుకు ససేమిరా అంటోందట. ఫొటోలను లీక్ చేస్తే తాము ప్రసారం చేసే పెళ్లి వీడియోను ఎవరు చూస్తారు.. అసలు మీరు ఫొటోలను ఎందుకు పోస్ట్ చేశారు.. అని నెట్ ఫ్లిక్స్ అడిగితే.. మీకు చెప్పినట్లు నెల రోజులు ఆగితే అప్పటి వరకు తమ పెళ్లికి ఉన్న జోష్ పోతుందని.. ఆ తరువాత ఎవరూ ఆ వీడియోను చూడరని.. కనుకనే ఫొటోలను పోస్ట్ చేశామని.. నయన్ దంపతులు చెబుతున్నారట. అయినప్పటికీ నెట్ ఫ్లిక్స్ అంగీకరించడం లేదని సమాచారం.
అయితే నెట్ ఫ్లిక్స్‌తో డీల్ మళ్లీ కుదరకపోతే వేరే ఏదైనా ఓటీటీ యాప్‌కు ఇంకాస్త తక్కువ ధరకు అయినా సరే తమ పెళ్లి వీడియో హక్కులను అమ్మాలని చూస్తున్నారట. మరి ఇందులో నిజం ఎంత ఉంది.. అనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది.
మాతృత్వం ఒక మహిళ జీవితంలో అత్యంత మధురమైన దశగా భావించబడుతుంది. బిడ్డకు జన్మనిచ్చిన ఆనందం ఒక వైపు ఉంటే, మరోవైపు…
మెటాకు చెందిన ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారుల భద్రతను మరింత బలోపేతం చేయడానికి కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి…
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్…
భారతీయ పోస్టల్ శాఖ 2026 సంవత్సరానికి గ్రామీణ డాక్ సేవక్ (GDS) నియామకాల అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ…
జూనియర్ ఎన్టీఆర్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం దేవర: పార్ట్ 2 భవితవ్యంపై గత కొంతకాలంగా అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ…
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…