Vignesh Shivan : న‌య‌న‌తార‌, విగ్నేష్ శివ‌న్ దంప‌తుల‌కు నెట్‌ఫ్లిక్స్ భారీ షాకిచ్చిందిగా.. దిమ్మ తిరిగిపోయింది..!

July 18, 2022 2:05 PM

Vignesh Shivan : లేడీ సూప‌ర్ స్టార్ న‌యన‌తార‌, ద‌ర్శ‌కుడు విగ్నేష్ శివ‌న్‌ల వివాహం ఈ మ‌ధ్యే జ‌రిగిన విష‌యం విదిత‌మే. వీరి వివాహం మ‌హాబ‌లిపురంలోని గ్రాండ్ షెర‌టాన్‌లో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ర‌జ‌నీకాంత్‌, షారూఖ్‌ఖాన్ వంటి దిగ్గ‌జ న‌టీన‌టులు హాజ‌ర‌య్యారు. పెళ్లి సంద‌ర్భంగా త‌మిళ‌నాడు వ్యాప్తంగా ఈ జంట ఒక ల‌క్ష మందికి అన్న‌దానం కూడా చేసి వార్త‌ల్లో నిలిచారు. అయితే ఈ జంట‌కు ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఊహించ‌ని షాకిచ్చింది. వీరి పెళ్లి ప్ర‌సార హ‌క్కుల‌ను సొంతం చేసుకున్న నెట్ ఫ్లిక్స్ ఆ హ‌క్కుల‌కు చెందిన ఒప్పందాన్ని ర‌ద్దు చేసుకుంద‌ట‌. దీంతో న‌య‌న్ దంప‌తుల‌కు భారీగానే న‌ష్టం వ‌చ్చింద‌ని అంటున్నారు.

త‌మ పెళ్లి ప్ర‌సార హ‌క్కుల‌ను న‌య‌న్‌, విగ్నేష్ దంపతులు నెట్ ఫ్లిక్స్‌కు రూ.25 కోట్ల‌కు అమ్మిన‌ట్లు తెలిసింది. అయితే ఒప్పందం ప్ర‌కారం నెల రోజుల వ‌ర‌కు వారు త‌మ పెళ్లి ఫొటోలు, వీడియోల‌ను బ‌య‌ట‌కు లీక్ చేయ‌రాదు. కానీ న‌య‌న్ దంప‌తులు ర‌జ‌నీకాంత్‌, షారూఖ్ ఖాన్‌ల ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది నెట్ ఫ్లిక్స్‌తో చేసుకున్న ఒప్పందానికి విరుద్ధం. క‌నుక నెట్ ఫ్లిక్స్ దీనిపై అసంతృప్తిని వ్య‌క్తం చేస్తూ ఆ డీల్‌ను ర‌ద్దు చేసుకుంద‌ట‌. దీంతో న‌య‌న్ దంప‌తులు నెట్ ఫ్లిక్స్‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ట‌.

Netflix reportedly cancelled their agreement wtih Vignesh Shivan
Vignesh Shivan

ముందుగా చేసుకున్న డీల్ ప్ర‌కారం అయితే రూ.25 కోట్ల మేర న‌య‌న్ దంప‌తుల‌కు న‌ష్టం క‌ల‌గనుంది. అయితే ఒప్పందాన్ని కాస్త త‌గ్గించి మ‌ళ్లీ డీల్ కుదుర్చుకునేలా వారు నెట్ ఫ్లిక్స్‌తో చ‌ర్చిస్తున్నార‌ట‌. కానీ నెట్ ఫ్లిక్స్ మాత్రం అందుకు స‌సేమిరా అంటోంద‌ట‌. ఫొటోల‌ను లీక్ చేస్తే తాము ప్రసారం చేసే పెళ్లి వీడియోను ఎవ‌రు చూస్తారు.. అస‌లు మీరు ఫొటోల‌ను ఎందుకు పోస్ట్ చేశారు.. అని నెట్ ఫ్లిక్స్ అడిగితే.. మీకు చెప్పిన‌ట్లు నెల రోజులు ఆగితే అప్ప‌టి వ‌ర‌కు త‌మ పెళ్లికి ఉన్న జోష్ పోతుంద‌ని.. ఆ త‌రువాత ఎవ‌రూ ఆ వీడియోను చూడ‌ర‌ని.. క‌నుక‌నే ఫొటోల‌ను పోస్ట్ చేశామ‌ని.. న‌య‌న్ దంప‌తులు చెబుతున్నార‌ట‌. అయిన‌ప్ప‌టికీ నెట్ ఫ్లిక్స్ అంగీక‌రించ‌డం లేద‌ని స‌మాచారం.

అయితే నెట్ ఫ్లిక్స్‌తో డీల్ మ‌ళ్లీ కుద‌ర‌క‌పోతే వేరే ఏదైనా ఓటీటీ యాప్‌కు ఇంకాస్త త‌క్కువ ధ‌ర‌కు అయినా స‌రే త‌మ పెళ్లి వీడియో హ‌క్కుల‌ను అమ్మాల‌ని చూస్తున్నార‌ట‌. మ‌రి ఇందులో నిజం ఎంత ఉంది.. అనే విష‌యం మాత్రం తెలియాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment