Bimbisara : బింబిసార మూవీని రిజెక్ట్ చేసిన న‌లుగురు స్టార్ హీరోలు ఎవరో తెలుసా..?

October 3, 2022 9:26 AM

Bimbisara : నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం బింబిసార. ఇటీవల విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది. డైరెక్టర్ వశిష్ట తెరకెక్కించిన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా కళ్యాణ్ రామ్ కెరీర్‏లో బిగ్గెస్ట్ హిట్‏గా బింబిసార నిలిచింది. కళ్యాణ్ రామ్ సహజ నటనకు.. డైరెక్టర్ వశిష్ట స్క్రీన్ ప్లే కు ప్రశంసలు కురిపించారు. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక వసూళ్లు రాబట్టి సంచలనం సృష్టించింది. వరుస ఫ్లాప్స్ తో కేరీర్ ను నెట్టుకొస్తున్న నందమూరి కళ్యాణ్ రామ్ ఫాంట‌సీ యాక్షన్ ఫిల్మ్ బింబిసారతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

తొలిసారిగా చక్రవర్తి పాత్రలో నటించిన కళ్యాణ్ రామ్ అద్భుతమైన పెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు. ద్విపాత్రాభినయంతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. వారం రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అవ్వ‌డంతో ఈ సినిమా మంచి లాభాలు సొంతం చేసుకుంది. ఇదిలా ఉండ‌గా ఈ సినిమాను ఏకంగా న‌లుగురు స్టార్ హీరోలు మిస్ చేసుకున్నార‌ట‌. ఇంతకీ.. ఆ అన్ ల‌క్కీ హీరోలు ఎవ‌రో ఇప్పుడు చూద్దాం. బింబిసార క‌థ‌ను ద‌ర్శ‌కుడు వ‌శిష్ఠ మొద‌ట‌గా హీరో నితిన్ కు చెప్పాడ‌ట‌.

these star heroes rejected Bimbisara movie know them
Bimbisara

కానీ నితిన్ క‌థ విని సినిమాను రిజెక్ట్ చేశాడ‌ట‌. ఆ త‌ర‌వాత ద‌ర్శ‌కుడు ఎన‌ర్జిటిక్ హీరో రామ్ పోతినేనికి వివ‌రించాడ‌ట‌. రామ్ కూడా ఈ క‌థ త‌న‌కు సెట్ అవ్వ‌ద‌ని చెప్పి రిజెక్ట్ చేశాడ‌ట‌. అంతే కాకుండా వ‌శిష్ఠ ఈ సినిమా క‌థ‌ను రాజ్ త‌రుణ్ కు సైతం వివ‌రించాడట. రాజ్ తరుణ్ కూడా క‌థ విని రిజెక్ట్ చేశాడు. మ‌రోవైపు హీరో ర‌వితేజకు కూడా ఈ క‌థ చెప్పాన‌ని వ‌శిష్ఠ ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపాడు. కానీ ర‌వితేజ ఈ సినిమాను సున్నితంగా తిర‌స్క‌రించాడట. ఇలా చ‌ర్చ‌లు జ‌రుపుతున్న క్ర‌మంలో బింబిసార సినిమా క‌థ‌కు క‌ల్యాణ్ రామ్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. న‌లుగురు హీరోలు రిజెక్ట్ చేసిన క‌థ‌తో కళ్యాణ్ రామ్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్నాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now