Liger Movie : గతకొన్ని రోజులుగా ఎక్కడ చూసినా లైగర్.. లైగర్.. అని ఈ సినిమా పేరే వినబడుతోంది. అందుకు కారణం యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ అని చెప్పవచ్చు. వీళ్ళిద్దరూ చేసిన పాన్ ఇండియా చిత్రమే లైగర్. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో పూరీ జగన్నాథ్ విజయం అందుకోవడం, విజయ్ కి నార్త్ లో ఫాలోయింగ్ ఉండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తగ్గట్టు ఫస్ట్ లుక్ నుంచి ట్రైలర్ వరకు అన్నింటికీ మంచి స్పందన వచ్చింది. ఇంకా చెప్పాలి అంటే.. ఇండియా షేక్ అయ్యింది.
ఈ సినిమాలో విజయ్ బాక్సర్ గా నటించగా, బాలీవుడ్ నటి అనన్య పాండే హీరోయిన్ గా నటించింది. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాలో మైక్ టై సన్ కూడా ముఖ్యమైన పాత్రలో నటించారు. అలాగే ఈ సినిమాలో విజయ్ కి తల్లిగా సీనియర్ నటి రమ్యకృష్ణ కూడా నటించింది. అయితే గురువారం విడుదలైన ఈ సినిమాకు సోషల్ మీడియా లో ఓ రేంజ్ లో నెగిటివ్ టాక్ మొదలైంది. డైరెక్టర్ పూరీని నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు. అయితే సినిమా నెగిటివ్ టాక్ రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలు ఉన్నాయి. కానీ సినిమా ఆ అంచనాలను రీచ్ అవ్వలేదని టాక్. లైగర్ సినిమా లో ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా ఉండగా.. సెకండ్ హాఫ్ మాత్రం తలనొప్పిగా మారిందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. అంతే కాకుండా మూవీ ప్రారంభం అయినప్పుడు ఆస్తక్తి గా ఉన్నప్పటికీ ఆ తరవాత మాత్రం ట్రాక్ తప్పిందని అంటున్నారు.
ఇంకా సినిమాలో వచ్చే పాటలు సంబంధం లేకుండా వస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు. ప్రముఖ బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ పాత్ర సినిమాకే హైలైట్ అవుతుంది అనుకున్నారు. కానీ హాలీవుడ్ నటుడి పాత్ర సినిమాలో కామెడీగా మారిపోయిందని అంటున్నారు. ఈ సినిమా కథ రాసుకోవడంలోనే పూరీ జగన్నాథ్ విఫలమయ్యాడు అంటూ ఆడియన్స్ ఫీల్ అవుతున్నారు. ఇక ముందు ముందు ఈ సినిమాకు ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…