Liger Movie : లైగర్ సినిమాకు నెగెటివ్ టాక్ రావడానికి అవే కారణమా..?

August 25, 2022 3:01 PM

Liger Movie : గతకొన్ని రోజులుగా ఎక్కడ చూసినా లైగర్.. లైగర్.. అని ఈ సినిమా పేరే వినబడుతోంది. అందుకు కారణం యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ అని చెప్ప‌వ‌చ్చు. వీళ్ళిద్దరూ చేసిన పాన్ ఇండియా చిత్రమే లైగర్. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో పూరీ జగన్నాథ్ విజయం అందుకోవడం, విజయ్ కి నార్త్ లో ఫాలోయింగ్ ఉండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తగ్గట్టు ఫస్ట్ లుక్ నుంచి ట్రైలర్ వరకు అన్నింటికీ మంచి స్పందన వచ్చింది. ఇంకా చెప్పాలి అంటే.. ఇండియా షేక్ అయ్యింది.

ఈ సినిమాలో విజయ్ బాక్సర్ గా నటించగా, బాలీవుడ్ నటి అనన్య పాండే హీరోయిన్ గా నటించింది. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాలో మైక్ టై సన్ కూడా ముఖ్యమైన పాత్రలో నటించారు. అలాగే ఈ సినిమాలో విజయ్ కి తల్లిగా సీనియర్ నటి రమ్యకృష్ణ కూడా నటించింది. అయితే గురువారం విడుదలైన ఈ సినిమాకు సోషల్ మీడియా లో ఓ రేంజ్ లో నెగిటివ్ టాక్ మొదలైంది. డైరెక్టర్ పూరీని నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు. అయితే సినిమా నెగిటివ్ టాక్ రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

these are the main reasons for Liger Movie negative talk
Liger Movie

పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలు ఉన్నాయి. కానీ సినిమా ఆ అంచనాలను రీచ్ అవ్వలేదని టాక్. లైగర్ సినిమా లో ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా ఉండగా.. సెకండ్ హాఫ్ మాత్రం తలనొప్పిగా మారిందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. అంతే కాకుండా మూవీ ప్రారంభం అయినప్పుడు ఆస్తక్తి గా ఉన్నప్పటికీ ఆ తరవాత మాత్రం ట్రాక్ తప్పిందని అంటున్నారు.

ఇంకా సినిమాలో వచ్చే పాటలు సంబంధం లేకుండా వస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు. ప్రముఖ బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ పాత్ర సినిమాకే హైలైట్ అవుతుంది అనుకున్నారు. కానీ హాలీవుడ్ నటుడి పాత్ర సినిమాలో కామెడీగా మారిపోయిందని అంటున్నారు. ఈ సినిమా కథ రాసుకోవడంలోనే పూరీ జగన్నాథ్ విఫలమయ్యాడు అంటూ ఆడియన్స్ ఫీల్ అవుతున్నారు. ఇక‌ ముందు ముందు ఈ సినిమాకు ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now