Anasuya : గత కొంతకాలంగా వార్తలకు దూరంగా ఉంటున్న అనసూయ ఇప్పుడు మరోసారి వార్తల్లోకి ఎక్కింది. సోషల్ మీడియాలో అనసూయపై నెగిటివిటీ, ట్రోల్స్ అధికం కాగా అనసూయ తిరిగి పోరాటం చేస్తున్నారు. తాజాగా సైబర్ క్రైమ్ పోలీసులకు అనసూయ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఆ ఫిర్యాదును ఆధారంగా చేసుకుని పోలీసులు కేసు నమోదు చేసి ఒక వ్యక్తిని అరెస్టు కూడా చేసినట్లు చెబుతున్నారు.
సాయి రవి 267 ఐడీతో ఉన్న ట్విట్టర్ అకౌంట్ ద్వారా హీరోయిన్స్ పోటోలు పెడుతున్నట్లుగా వెళ్లడయ్యింది. ఈ నేపథ్యంలో తన ఫోటోలు కూడా వాటిలో ఉన్నట్లు గుర్తించిన అనసూయ ఈ నెల 17వ తేదీన సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీర్రాజు మీద 354 (A)(D), 559 ఐపిసి సెక్షన్ 67 67(A) ఐ టి యాక్ట్ 2000 2018 చట్టాల ప్రకారం కేసులు నమోదు చేశారు. సదరు వ్యక్తి ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ లలో టాలీవుడ్ హీరోయిన్స్ ఫోటోలు పెట్టి అసభ్యకరమైన రాతలు రాస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు.
సినీ పరిశ్రమలోని హీరోయిన్లు, యాంకర్స్ టార్గెట్ చేస్తూ వారి ఫోటోలను సేకరించి అసభ్యంగా రాతలు రాస్తున్నట్లుగా దర్యాప్తులో వెళ్లడయ్యింది. కేవలం అనసూయ మాత్రమే కాదు నటి రోజా, విష్ణు ప్రియ, రష్మీ, ప్రగతి వంటి వారి ఫోటోలను కూడా వాడుతూ దారుణమైన ఫోటోలు షేర్ చేస్తున్నట్లు గుర్తించారు. అనసూయ ఫిర్యాదును కేసుగా నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టి సదరు వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు
వీర్రాజు అరెస్ట్ చేసిన నేపథ్యంలో అనసూయ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారు అభ్యకరమైన కామెంట్స్ తో మానసిక వేదనకు గురి చేస్తున్నారు. ఇలానే సోషల్ మీడియా వేధింపులకు పాల్పడుతున్న మిగతవారు కూడా భయపడాలనే ఉద్దేశంతో తన అకౌంట్ లో వీర్రాజు ను అరెస్ట్ చేసిన విషయాన్ని షేర్ చేసానని అనసూయ పేర్కొన్నారు. మరీ ఈ అరెస్ట్ తో అయినా ఆమెను ట్రోల్ చేస్తున్నవారు భయపడతారని అనసూయ నమ్ముతున్నారు. మరి ఏ మేరకు అనసూయ విజయం సాధించారో వేచి చూడాలి.
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…