Thank You : మనం ఫేమ్ విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా వచ్చిన చిత్రం.. థాంక్ యూ. ఈ మూవీ శుక్రవారం థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో చైతూకు జోడీగా ముగ్గురు భామలు నటించారు. రాశి ఖన్నా మెయిన్ లీడ్ రోల్ చేయగా.. మాళవికా నాయర్, అవికా గోర్‌లు ఇతర లీడ్ రోల్స్‌లో నటించారు. ఈ క్రమంలోనే ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తోంది. చైతూ మరోసారి మ్యాజిక్ చేశాడని అంటున్నారు.
ఇక థాంక్ యూ మూవీని దిల్ రాజు తన వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించారు. థమన్ సంగీతం అందించారు. చిత్రంలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తప్ప పాటలు బాగానే ఉన్నట్లు ఇప్పటికే తెలిసిపోయింది. అయితే ఈ మూవీకి గాను డిజిటల్ హక్కులను సన్ నెక్ట్స్‌తోపాటు అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ రెండు యాప్‌లలోనూ ఈ మూవీ ఒకేసారి రిలీజ్ కానుంది.
మూవీ రిలీజ్ అయ్యాక 4 వారాలకు ఓటీటీలో రిలీజ్ చేసేట్లుగా డీల్ కుదుర్చుకున్నారు. కనుక సినిమా వచ్చే నెల.. అంటే ఆగస్టు 22 వరకు ఈ ఓటీటీ యాప్‌లలో రిలీజ్ అవుతుందని తెలుస్తోంది. ఇక నాగచైతన్య త్వరలోనే లాల్ సింగ్ చడ్డా అనే హిందీ మూవీలో కనిపించనున్నాడు. దీని అనంతరం వెంటనే ఇంకో మూవీని చైతూ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్‌లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…