Donkey Milk : హైద‌రాబాద్‌లో గాడిద పాల‌కు భ‌లే డిమాండ్‌.. లీట‌ర్ ధ‌ర రూ.7వేలు.. గాడిద‌ల్ని పెంచుకున్నా చాలుగా..!

Donkey Milk : హైద‌రాబాద్‌కు స‌మీప ప్రాంతాల నుంచి అనేక మంది న‌గ‌రానికి వ‌చ్చి అనేక వ్యాపారాలు చేస్తుంటారు. అయితే ఈ మ‌ధ్య కాలంలో గాడిద పాల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయ‌లుగా కొన‌సాగుతోంది. న‌గ‌రానికి స‌మీపంలో ఉన్న కొన్ని ప్రాంతాల్లో నివ‌సిస్తున్న రైతులు కొంద‌రు గాడిద‌ల్ని పెంచుతూ చ‌క్క‌ని ఆదాయం సంపాదిస్తున్నారు. వారు వారం లేదా 15 రోజుల‌కు ఒక‌సారి గాడిద‌ల‌ను తెచ్చి న‌గ‌రంలో వాటి పాల‌ను అమ్ముతూ లాభాల‌ను గ‌డిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే లీట‌ర్ గాడిద పాల ధ‌ర రూ.7వేల వ‌ర‌కు ప‌లుకుతోంది.

గాడిద పాలను సేవిస్తే రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంద‌ని చాలా మంది న‌మ్ముతున్నారు. అంతేకాకుండా ఈ పాల‌లో ఆవు, గేదె, మేక పాల క‌న్నా విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ అధికంగా ఉంటాయ‌ట‌. ఇవి అనేక రోగాల నుంచి ర‌క్షిస్తాయ‌ట‌. అలాగే టైప్ 2 డ‌యాబెటిస్ ను త‌గ్గించే ఔష‌ధ గుణాలు కూడా గాడిద పాల‌లో ఉంటాయ‌ట‌. క‌నుకనే ఈ పాల‌ను తాగేందుకు చాలా మంది ఆస‌క్తిని చూపిస్తున్నారు. ఇక త‌క్కువ మొత్తంలో కావాలంటే 10 ఎంఎల్ సీసాల‌ను కూడా విక్ర‌యిస్తున్నారు. వీటి ధ‌ర సీసాకు రూ.100 వ‌ర‌కు ప‌లుకుతుండ‌డం విశేషం. సాధారణ పాలు అయితే మ‌న‌కు రూ.100 పెడితేనే లీట‌ర్‌కు పైగానే వ‌స్తాయి. కానీ గాడిద పాలు మాత్రం 10 ఎంఎల్ వ‌ర‌కు మాత్ర‌మే వ‌స్తాయి. దీంతో ఈ వ్యాపారం మంచి లాభ‌సాటిగా ఉంద‌ని రైతులు చెబుతున్నారు.

Donkey Milk

హైద‌రాబాద్‌కు స‌మీపంలో ఉన్న మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా నుంచి చాలా మంది రైతులు గాడిద పాల‌ను తెచ్చి విక్ర‌యిస్తున్నారు. అయితే కొంద‌రు ఐటీ ఉద్యోగులు కూడా చేస్తున్న ఉద్యోగాల‌ను మానేసి గాడిద‌ల ఫామ్‌ల‌ను పెట్టి పాల‌ను అమ్ముతూ ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను సంపాదిస్తున్నార‌ట‌. దీంతో ఇదో కొత్త ఉపాధి మార్గం అయింద‌ని అంటున్నారు. ఇక గాడిద పాల‌లో మ‌న శ‌రీరానికి మేలు చేసే మంచి బాక్టీరియా కూడా అధికంగా ఉంటుంద‌ట‌. అందువ‌ల్లే ఈ పాల‌కు అంత‌టి డిమాండ్ ఏర్ప‌డింద‌ని అంటున్నారు. ఇక ఇదంతా చూసి నాలుగు గాడిద‌ల్ని పెట్టుకున్నా ద‌ర్జాగా డ‌బ్బులు సంపాదించ‌వ‌చ్చు క‌దా.. అని కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

రిస్క్ చేస్తేనే మంచి సినిమా.. ‘డెకాయిట్’ క్లైమాక్స్‌పై నిర్మాత సుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు!

మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేన‌ని నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీల‌క‌మ‌ని, ఇప్పుడు ప్రేక్ష‌కులు…

Tuesday, 14 April 2026, 7:27 PM

ఐపీఎల్ జట్టు ఎందుకు కొనలేదు? అసలు నిజం చెప్పిన అభిషేక్ బచ్చన్.. అంత బడ్జెట్ నా దగ్గర లేదు!

నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…

Tuesday, 14 April 2026, 5:35 PM

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి అంటే?

ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ…

Tuesday, 14 April 2026, 3:21 PM

పాత ఫ్లాపులని గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తే బాధగా ఉంటుంది.. కృతి శెట్టి ఎమోషనల్ కామెంట్స్!

తాను గ‌తంలో చేసిన సినిమాలు చాలా వ‌ర‌కు ఫ్లాప్ అయ్యాయి క‌నుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…

Saturday, 11 April 2026, 8:35 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్‌పై చిరంజీవి ఎమోషనల్.. పరిశ్రమకు ఇది పెద్ద దెబ్బ అంటూ ఆవేదన!

తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన‌ చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంట‌ర్నెట్‌లో…

Friday, 10 April 2026, 6:40 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్.. 5 నిమిషాల యాక్షన్ సీన్ నెట్టింట వైరల్! షాక్‌లో చిత్ర యూనిట్..

తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…

Friday, 10 April 2026, 12:43 PM

ప్రొపగాండా అంటే ఏంటి? ‘ధురంధర్ 2’ విమర్శకులపై సందీప్ రెడ్డి వంగా నిప్పులు!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధ‌ర్ 2 ది…

Thursday, 9 April 2026, 11:07 PM

‘కిల్లర్’ మిల్లర్ ఇప్పుడు విలన్ అయ్యాడా? డీసీ ఓటమిపై సునీల్ గవాస్కర్ సంచలన విశ్లేషణ..

ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…

Thursday, 9 April 2026, 9:01 PM