Indian Passport : వీసా లేకుండానే కేవ‌లం పాస్ పోర్ట్‌తో.. మ‌నం ఈ దేశాల‌కు వెళ్ల‌వ‌చ్చు..!

Indian Passport : ప్ర‌పంచ దేశాల‌కు చెందిన పాస్‌పోర్టుల‌కు ర్యాంకులు ఇచ్చే హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ సంస్థ తాజాగా మ‌రోమారు ఆయా దేశాల‌కు చెందిన పాస్ పోర్టుల‌కు ర్యాంకుల‌ను ప్ర‌క‌టించింది. ఈ క్ర‌మంలోనే జ‌పాన్ పాస్‌పోర్టు ప్ర‌పంచంలోనే అత్యంత శ‌క్తివంత‌మైందిగా ఆ సంస్థ తాజాగా ఓ నివేదిక‌ను విడుద‌ల చేసింది. ఆ నివేదిక ప్ర‌కారం జ‌పాన్ త‌రువాత రెండో స్థానంలో సింగ‌పూర్‌, ద‌క్షిణ కొరియా నిలిచాయి. జ‌పాన్ పాస్‌పోర్టు ఉన్న‌వారు ఏకంగా 193 దేశాల‌కు వీసా లేకుండానే వెళ్ల‌వ‌చ్చు. అదే సింగ‌పూర్, ద‌క్షిణ కొరియా అయితే 192 దేశాల‌కు వెళ్ల‌వ‌చ్చు. ఇక ఈ జాబితాలో భారత్ 90వ స్థానంలో నిలిచింది. ఈ క్ర‌మంలోనే భార‌త పాస్ పోర్ట్‌తో 80 దేశాల‌కు వీసా అవ‌స‌రం లేకుండానే వెళ్ల‌వ‌చ్చు. ఇక ఆయా దేశాల జాబితాను ఇప్పుడు తెలుసుకుందాం.

భార‌త పాస్‌పోర్ట్‌తో ఓషియానాలోని.. కుక్ ఐలాండ్స్‌, ఫిజి, మార్ష‌ల్ ఐలాండ్స్‌, మైక్రోనిషియా, నైయూ, ప‌లౌ ఐలాండ్స్‌, స‌మోవా, తువ‌లు, వ‌నౌటు.. త‌దిత‌ర దేశాల‌కు వెళ్ల‌వచ్చు. అలాగే మ‌ధ్య తూర్పు ఆసియాలోని ఇరాన్‌, జోర్డాన్‌, ఓమ‌న్‌, ఖతార్‌ల‌కు, యూరోప్‌లోని అల్బేనియా, సెర్బియాకు, క‌రేబియ‌న్ ప్రాంతంలోని బార్బ‌డోస్‌, ది బ్రిటిష్ వ‌ర్జిన్ ఐలాండ్స్‌, డొమినికా, గ్రెనాడా, హైతీ, జ‌మైకా, మాంటెస్రాట్‌, సెయింట్ కిట్స్ అండ్ నీవియా, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్‌, ట్రినిడాడ్ అండ్ టోబాగోల‌కు వెళ్ల‌వ‌చ్చు.

Indian Passport

ఆసియాలోని భూటాన్, కంబోడియా, ఇండోనేషియా, లావోస్‌, మ‌కావ్‌, మాల్దీవ్స్‌, మ‌య‌న్మార్‌, నేపాల్‌, శ్రీ‌లంక‌, థాయ్‌లాండ్‌, టైమోర్ లెస్టెల‌తోపాటు.. అమెరికాలోని బొలివియా, ఎల్ సాల్వెడార్‌ల‌కు కూడా వీసా లేకుండా వెళ్ల‌వ‌చ్చు. అలాగే ఆఫ్రికాలోని బోట్స్‌వానా, బురుండి, కేప్ వెర్డె ఐలాండ్స్‌, కొమొరో ఐలాండ్స్‌, ఇథియోపియా, గాబ‌న్‌, గినియా – బిసౌ, మ‌డ‌గాస్క‌ర్‌, మారిటేనియా, మారిష‌స్‌, మొజాంబిక్‌, ర్వాండా, సెనెగ‌ల్‌, సైకిలిస్‌, సియార్రా లియోన్‌, సోమాలియా, టాంజానియా, టోగో, టునిషియా, ఉగాండా, జింబాబ్వే.. త‌దిత‌ర దేశాల‌కు కూడా భార‌త పాస్‌పోర్ట్‌తో వీసా లేకుండానే వెళ్ల‌వ‌చ్చు. అయితే వీటిల్లో కొన్నింటికి వీసా అస‌లు అవ‌స‌ర‌మే లేదు. కానీ కొన్నింటికి మాత్రం ఆయా దేశాల‌కు వెళ్ల‌గానే ఎయిర్ పోర్ట్‌లో అక్క‌డిక్క‌డే వీసా ఇస్తారు. దీన్నే వీసా ఆన్ అరైవ‌ల్ అంటారు. ఇందుకుగాను ముందుగా వీసా తీసుకోవాల్సిన ప‌నిలేదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

రిస్క్ చేస్తేనే మంచి సినిమా.. ‘డెకాయిట్’ క్లైమాక్స్‌పై నిర్మాత సుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు!

మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేన‌ని నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీల‌క‌మ‌ని, ఇప్పుడు ప్రేక్ష‌కులు…

Tuesday, 14 April 2026, 7:27 PM

ఐపీఎల్ జట్టు ఎందుకు కొనలేదు? అసలు నిజం చెప్పిన అభిషేక్ బచ్చన్.. అంత బడ్జెట్ నా దగ్గర లేదు!

నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…

Tuesday, 14 April 2026, 5:35 PM

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి అంటే?

ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ…

Tuesday, 14 April 2026, 3:21 PM

పాత ఫ్లాపులని గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తే బాధగా ఉంటుంది.. కృతి శెట్టి ఎమోషనల్ కామెంట్స్!

తాను గ‌తంలో చేసిన సినిమాలు చాలా వ‌ర‌కు ఫ్లాప్ అయ్యాయి క‌నుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…

Saturday, 11 April 2026, 8:35 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్‌పై చిరంజీవి ఎమోషనల్.. పరిశ్రమకు ఇది పెద్ద దెబ్బ అంటూ ఆవేదన!

తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన‌ చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంట‌ర్నెట్‌లో…

Friday, 10 April 2026, 6:40 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్.. 5 నిమిషాల యాక్షన్ సీన్ నెట్టింట వైరల్! షాక్‌లో చిత్ర యూనిట్..

తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…

Friday, 10 April 2026, 12:43 PM

ప్రొపగాండా అంటే ఏంటి? ‘ధురంధర్ 2’ విమర్శకులపై సందీప్ రెడ్డి వంగా నిప్పులు!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధ‌ర్ 2 ది…

Thursday, 9 April 2026, 11:07 PM

‘కిల్లర్’ మిల్లర్ ఇప్పుడు విలన్ అయ్యాడా? డీసీ ఓటమిపై సునీల్ గవాస్కర్ సంచలన విశ్లేషణ..

ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…

Thursday, 9 April 2026, 9:01 PM