Thank You : థాంక్ యూ మూవీ ఓటీటీలో.. ఎందులో.. ఎప్పుడు.. అంటే..?

జూలై 22, 2022 4:03 సా.

Thank You : మ‌నం ఫేమ్ విక్ర‌మ్ కె.కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో నాగ‌చైత‌న్య హీరోగా వ‌చ్చిన చిత్రం.. థాంక్ యూ. ఈ మూవీ శుక్ర‌వారం థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇందులో చైతూకు జోడీగా ముగ్గురు భామ‌లు న‌టించారు. రాశి ఖ‌న్నా మెయిన్ లీడ్ రోల్ చేయ‌గా.. మాళ‌వికా నాయ‌ర్‌, అవికా గోర్‌లు ఇత‌ర లీడ్ రోల్స్‌లో న‌టించారు. ఈ క్ర‌మంలోనే ఈ మూవీకి బాక్సాఫీస్ వ‌ద్ద పాజిటివ్ రెస్పాన్స్ ల‌భిస్తోంది. చైతూ మ‌రోసారి మ్యాజిక్ చేశాడ‌ని అంటున్నారు.

ఇక థాంక్ యూ మూవీని దిల్ రాజు త‌న వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై నిర్మించారు. థ‌మ‌న్ సంగీతం అందించారు. చిత్రంలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ త‌ప్ప పాట‌లు బాగానే ఉన్న‌ట్లు ఇప్ప‌టికే తెలిసిపోయింది. అయితే ఈ మూవీకి గాను డిజిట‌ల్ హ‌క్కుల‌ను స‌న్ నెక్ట్స్‌తోపాటు అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. దీంతో ఈ రెండు యాప్‌ల‌లోనూ ఈ మూవీ ఒకేసారి రిలీజ్ కానుంది.

Thank You movie to release on OTT know the app and date
Thank You

మూవీ రిలీజ్ అయ్యాక 4 వారాల‌కు ఓటీటీలో రిలీజ్ చేసేట్లుగా డీల్ కుదుర్చుకున్నారు. క‌నుక సినిమా వ‌చ్చే నెల‌.. అంటే ఆగ‌స్టు 22 వ‌ర‌కు ఈ ఓటీటీ యాప్‌ల‌లో రిలీజ్ అవుతుంద‌ని తెలుస్తోంది. ఇక నాగచైత‌న్య త్వ‌ర‌లోనే లాల్ సింగ్ చ‌డ్డా అనే హిందీ మూవీలో కనిపించ‌నున్నాడు. దీని అనంత‌రం వెంట‌నే ఇంకో మూవీని చైతూ ప్రారంభించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment