Sivaji : న‌టుడు శివాజీపై దారుణ‌మైన ట్రోల్స్‌.. అలా అనిపించుకోవ‌డం ఎందుకు..?

July 7, 2022 4:04 PM

Sivaji : న‌టుడు శివాజీ వెండితెరపై క‌నిపించి చాలా రోజులే అయింది. ఆయ‌న చివ‌రి సారిగా 2016లో సీసా అనే సినిమాలో క‌నిపించారు. త‌రువాత సినిమాల‌కు దూర‌మ‌య్యారు. కొంత కాలం పాటు పాలిటిక్స్‌లో చురుగ్గా ఉన్నారు. అప్ప‌ట్లో ఆయ‌న ప్ర‌త్యేక హోదా గురించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తూ వార్త‌ల్లో నిలిచారు. కొంత కాలం పాటు చంద్ర బాబును విమ‌ర్శించారు. ఆ త‌రువాత యూ ట‌ర్న్ తీసుకుని టీడీపీలో చేరారు. చంద్ర‌బాబు మ‌ళ్లీ వ‌స్తేనే ఏపీ బాగు ప‌డుతుంద‌ని అప్పుడ‌ప్పుడు వ్యాఖ్య‌లు చేస్తున్నారు. అయితే ఆయ‌న అటు సినిమాల్లో.. ఇటు రాజ‌కీయాల్లో యాక్టివ్‌గా క‌నిపించి చాలా రోజులే అయింది. కాగా ఆయ‌న ఓ కార్య‌క్ర‌మంలో భాగంగా చేసిన వ్యాఖ్య‌ల‌కు ఆయ‌న‌ను నెటిజ‌న్లు ట్రోల్ చేస్తున్నారు. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే..

శ్రీ‌విష్ణు హీరోగా అల్లూరి టైటిల్‌తో ఓ మూవీని తెర‌కెక్కిస్తున్న విష‌యం విదిత‌మే. అందులో భాగంగానే ఈ సినిమాకు సంబంధించిన ఓ ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మంలో న‌టుడు శివాజీ కూడా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. నా చివ‌రి సినిమా బూచ‌మ్మ బూచోడు. సినిమాలు వ‌దిలేయ‌కుండా ఉండి ఉంటే ఈ 10 ఏళ్ల‌లో క‌నీసం రూ.10 నుంచి రూ.15 కోట్లు సంపాదించేవాడిని. కానీ పాలెం బ‌స్సు సంఘ‌ట‌న న‌న్ను క‌ల‌చి వేసింది. న‌న్ను సినిమాల‌కు దూరం చేసింది.. అని అన్నారు.

Telugu actor Sivaji being trolled by netizen for his comments
Sivaji

అయితే శివాజీ వ్యాఖ్య‌ల‌పై నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. మీరు ఏమైనా మెగాస్టారా.. అన్ని కోట్లు సంపాదించ‌డానికి. మీరు ఏమంత పెద్ద స్టార్‌.. అన్ని కోట్లు సంపాదించేందుకు.. అని ప్ర‌శ్నిస్తూ ఆయ‌న‌ను ట్రోల్ చేస్తున్నారు. దీంతో ఈ వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఇక ప్ర‌స్తుతం శివాజీ అమెరికాలో ఉంటూ అప్పుడ‌ప్పుడు ఇండియాకు వ‌చ్చి ఇలా కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment