సీఎం కేసీఆర్ చేతిలో తెలంగాణ బందీ అయిందని, రాష్ట్రానికి విముక్తి కల్పించేందుకు శ్రమిస్తానని రాష్ట్ర నూతన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. తెరాస ప్రభుత్వం అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవినీతి, అక్రమాలకు పాల్పడుతుందని, ఆ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని అన్నారు. సీఎం కేసీఆర్‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తామన్నారు.
జూబ్లీ హిల్స్‌లోని క్యాంపు కార్యాలయంలో రేవంత్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ను గద్దె దించితేనే అమరులు, రైతులు, నిరుద్యోగుల కుటుంబాలకు న్యాయం జరుగుతుందని అన్నారు. తెలంగాణ తల్లికి తెరాస నుంచి విముక్తి కల్పించేందుకే ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తనకు పీసీసీ పదవిని అప్పగించారని అన్నారు.
తనకు పీసీసీ అధ్యక్ష పదవిని ఇవ్వగానే ప్రగతి భవన్ లో ప్రతిపక్ష నేతలకు తలుపులు తెరుచుకున్నాయని రేవంత్ రెడ్డి అన్నారు. యువ ప్రతినిధి ఉండాలనే ఆలోచనతోనే సీనియర్లతో చర్చించి అధిష్టానం తనకు ఈ పదవిని అప్పగించిందని అన్నారు. పేదల సమస్యలపై పోరాడేందుకు అవకాశం లభించిందని అన్నారు.
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…
భారత్, శ్రీలంకలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరగనున్న టీ20 వరల్డ్‌కప్ 2026 జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై భారత…