“తెరాస నుంచి తెలంగాణ‌కు విముక్తి క‌ల్పిస్తాం”

జూన్ 30, 2021 12:05 సా.

సీఎం కేసీఆర్ చేతిలో తెలంగాణ బందీ అయింద‌ని, రాష్ట్రానికి విముక్తి క‌ల్పించేందుకు శ్ర‌మిస్తాన‌ని రాష్ట్ర నూత‌న పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. తెరాస ప్ర‌భుత్వం అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవినీతి, అక్ర‌మాల‌కు పాల్ప‌డుతుంద‌ని, ఆ ప్ర‌భుత్వాన్ని గ‌ద్దె దించుతామ‌ని అన్నారు. సీఎం కేసీఆర్‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తామ‌న్నారు.

we will free telangana from trs says revanth reddy

జూబ్లీ హిల్స్‌లోని క్యాంపు కార్యాల‌యంలో రేవంత్ రెడ్డి విలేక‌రుల‌తో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ను గ‌ద్దె దించితేనే అమ‌రులు, రైతులు, నిరుద్యోగుల కుటుంబాల‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని అన్నారు. తెలంగాణ త‌ల్లికి తెరాస నుంచి విముక్తి క‌ల్పించేందుకే ఏఐసీసీ అధ్య‌క్షురాలు సోనియా గాంధీ త‌న‌కు పీసీసీ ప‌ద‌విని అప్ప‌గించార‌ని అన్నారు.

త‌న‌కు పీసీసీ అధ్యక్ష ప‌దవిని ఇవ్వ‌గానే ప్ర‌గతి భ‌వ‌న్ లో ప్ర‌తిప‌క్ష నేతల‌కు త‌లుపులు తెరుచుకున్నాయ‌ని రేవంత్ రెడ్డి అన్నారు. యువ ప్ర‌తినిధి ఉండాల‌నే ఆలోచ‌న‌తోనే సీనియ‌ర్ల‌తో చ‌ర్చించి అధిష్టానం త‌న‌కు ఈ ప‌ద‌విని అప్ప‌గించింద‌ని అన్నారు. పేద‌ల స‌మ‌స్య‌లపై పోరాడేందుకు అవ‌కాశం ల‌భించింద‌ని అన్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment