లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తివేసే దిశ‌గా తెలంగాణ స‌ర్కారు.. జూన్ 20 నుంచే అమ‌లు..?

June 17, 2021 11:45 AM

దేశ‌వ్యాప్తంగా రోజువారీగా న‌మోద‌వుతున్న కోవిడ్ కేసుల సంఖ్య గ‌ణ‌నీయంగా త‌గ్గిన విష‌యం విదిత‌మే. అందులో భాగంగానే అనేక రాష్ట్రాల్లో ఇప్ప‌టికే లాక్‌డౌన్ ఆంక్ష‌ల‌ను క్ర‌మంగా స‌డ‌లిస్తున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలోనూ కేసుల సంఖ్య‌లో త‌గ్గుద‌ల క‌నిపిస్తోంది. పాజిటీవిటీ రేటు 1 శాతానికి చేరుకుంది. దీంతో రాష్ట్రంలోనూ లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ను స‌డ‌లించాల‌ని ప్ర‌భుత్వం ఆలోచిస్తోంది.

telangana government may lift lock down completely

అయితే నిబంధ‌న‌ల‌ను స‌డ‌లించ‌డం క‌న్నా పూర్తిగా లాక్‌డౌన్‌ను ఎత్తేస్తేనే బాగుంటుంద‌ని ప్ర‌భుత్వం భావిస్తున్న‌ట్లు తెలిసింది. అయితే లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తే రాత్రి 9 నుంచి ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు రాత్రి క‌ర్ఫ్యూను అమ‌లు చేయాలా, వ‌ద్దా ? అని కూడా ఆలోచిస్తున్న‌ట్లు తెలిసింది. రాత్రి క‌ర్ఫ్యూ ఉంటే ఆర్‌టీసీ సేవ‌ల‌కు ఆటంకం క‌లుగుతుంది. ప్ర‌జా రవాణాకు ఇబ్బంది క‌లుగుతుంది. క‌నుక లాక్‌డౌన్‌తోపాటు రాత్రి క‌ర్ఫ్యూను కూడా పూర్తిగా ఎత్తేసే ఆలోచ‌న‌లో ప్ర‌భుత్వం ఉన్న‌ట్లు స‌మాచారం.

ఇక లాక్‌డౌన్, రాత్రి క‌ర్ఫ్యూల‌ను ఎత్తేసే విష‌యంలో సీఎం కేసీఆర్ ఉన్న‌త స్థాయి స‌మావేశంలో నిర్ణ‌యం తీసుకోనున్నారు. ఈ నెల 19వ తేదీ వ‌ర‌కు లాక్‌డౌన్ నిబంధ‌న‌లు అమ‌లులో ఉన్నాయి. క‌నుక ఈ రోజు లేదా రేపు స‌మావేశ‌మై నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్లు తెలుస్తోంది. కాగా తెలంగాణ‌లో బుధ‌వారం ఒక్క రోజే 1489 కోవిడ్ కేసులు న‌మోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 6,07,925కు చేరుకుంది. 3,521 మంది చ‌నిపోయారు. 24 గంట‌ల్లో 11 మంది మృతి చెందారు. గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో 175, న‌ల్గొండ‌లో 131, ఖ‌మ్మంలో 118 కేసులు గ‌త 24 గంట‌ల్లో న‌మోదు అయ్యాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment