సోనూసూద్‌ను క‌లిసేందుకు 700 కిలోమీట‌ర్లు కాలిన‌డ‌క‌న వెళ్లిన అభిమాని..!

June 11, 2021 2:57 PM

త‌మ‌కు ఇష్టం ఉన్న సెల‌బ్రిటీల‌ను క‌లిసేందుకు అభిమానులు ఎంత వ‌రకైనా వెళ్తుంటారు. ఏ సాహసాలు అయినా చేస్తుంటారు. ఈ క్ర‌మంలోనే భార‌తీయుల గుండెల్లో రియ‌ల్ లైఫ్ హీరోగా చెర‌గ‌ని ముద్ర వేసుకున్న సోనూ సూద్‌ను క‌లిసేందుకు కూడా ఓ అభిమాని సాహ‌సం చేశాడు. హైద‌రాబాద్ నుంచి అత‌ను ముంబైకి కాలిన‌డ‌క‌న వెళ్లాడు. ఎట్టకేల‌కు త‌న హీరో సోనూసూద్‌ను క‌లిశాడు. అప్పుడు ఆ అభిమానికి క‌లిగిన ఆనందం మాట‌ల్లో చెప్ప‌లేనిది.

hyderabad fan venkatesh walked 700 kilo meters to meet sonu sood

హైద‌రాబాద్‌కు చెందిన వెంక‌టేష్ 700 కిలోమీట‌ర్ల దూరం న‌డిచి ముంబైకి చేరుకుని సోనూ సూద్‌ను క‌లిశాడు. అయితే ఈ విష‌యం తెలుసుకున్న సోనూ సూద్ అత‌న్ని ఆ ప‌నిచేయ‌వ‌ద్ద‌ని వారించాడు. అయినా వెంక‌టేష్ విన‌లేదు. క‌నీసం త‌న‌ను క‌లిసేందుకు ర‌వాణా స‌దుపాయం అయినా ఏర్పాటు చేస్తాన‌ని సోనూ వెంక‌టేష్‌కు తెలిపాడు. వెంక‌టేష్ అందుకు కూడా ఒప్పుకోలేదు. దీంతో సోనూ నిశ్శ‌బ్దంగా ఉండిపోయాడు. ఇక ఎట్ట‌కేల‌కు వెంక‌టేష్ సోనూ సూద్‌ను ముంబైలో క‌లిసి ఫొటో దిగాడు. ఆ స‌మ‌యంలో వెంక‌టేష్ ఉబ్బి త‌బ్బిబ్బ‌య్యాడు.

కాగా సోనూ సూద్ ఇప్ప‌టికే దేశంలో ఎంతో మందికి స‌హాయం చేయ‌గా, తాజాగా కోవిడ్ సెకండ్ వేవ్ నేప‌థ్యంలో అనేక మందికి ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా చేస్తున్నాడు. 150-200 ప‌డ‌క‌లు ఉన్న హాస్పిట‌ల్స్‌కు స‌మీపంలో సోనూ ఆక్సిజ‌న్ ప్లాంట్ల‌ను ఏర్పాటు చేస్తున్నాడు. దీంతో ఆక్సిజ‌న్ కొర‌త లేకుండా చూస్తున్నాడు. కాగా సోనూ త్వ‌ర‌లో అక్ష‌య్ కుమార్ స‌ర‌స‌న పృథ్వీ రాజ్ అనే బాలీవుడ్ మూవీతోపాటు తెలుగులో విడుద‌ల కానున్న ఆచార్య మూవీలోనూ క‌నిపించ‌నున్నాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment