కరోనా మృతదేహంపై బంగారం… దగ్గరకు రాని కుటుంబ సభ్యులు.. మరి బంగారం ఎలా?

May 20, 2021 10:18 PM

ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న కరోనా పరిస్థితులను చూస్తే మనుషులలో మానవత్వం పూర్తిగా నశించిపోయిందని తెలుస్తుంది. ఇన్నిరోజులు కుటుంబంలో ఎంతో ప్రేమను చూపిస్తూ, ఎంతో ఆప్యాయతలు పంచుకున్న వారు కరోనా సోకగానే వారిని ఒక అంటరాని వారిగా చూడడం మొదలుపెట్టారు. కరోనా నువ్వు, మనం, మన కుటుంబం అనే మాటలకు అర్థాలనే మార్చి,నేను,నా కుటుంబం అనే అర్థాలను నేర్పింది.

కరోనా వచ్చి మరణించిన వ్యక్తి దహన సంస్కరణలు నిర్వహించడానికి ముందుకు రాని కుటుంబసభ్యులు ఆ శవం పై ఉన్న బంగారు నగలకు మాత్రం ముందుకు వస్తున్నారు. అంత్యక్రియలకు ముందుకు రాని కుటుంబ సభ్యులు వారి దేహం పై ఉన్న బంగారం మోజుతో ఇతరులకు డబ్బులు ఇచ్చి వారి ఒంటిపై ఉన్న బంగారు నగలను తీసుకోవడానికి వెనుకాడటం లేదు.

తాజాగా మేడ్చల్ మల్కజ్‌గిరి జిల్లాలోని కీసర మండలంలో మహిళా కరోనాతో చనిపోతే శవాన్ని తాగడానికి ముందుకురాని బంధువులు బంగారం కోసం ముందుకు వచ్చారు.తన ఒంటిపై ఉన్న లక్ష రూపాయలు విలువ చేసే బంగారు నగలను తీసి ఇవ్వడానికి స్థానికంగా ఓ వ్యక్తిని 14 వేల రూపాయలు డబ్బులు ఇచ్చి నియమించుకున్నారు.ఈ క్రమంలోనే ఆ వ్యక్తి శవం పై ఉన్న లక్ష రూపాయల విలువ చేసే బంగారాన్ని ఇచ్చి 14000 వెంట తీసుకుపోయాడు.దీంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది నెటిజన్లు ప్రస్తుతం మనుషుల మధ్య మానవ సంబంధాలు పూర్తిగా తగ్గిపోయాయని భావిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment