తెలంగాణ

దారుణం: కరోనా భయంతో చికిత్సకు నోచుకోని గర్భిణి.. ఆంబులెన్స్ లోనే మృతి..

ఆమె నెలలునిండిన గర్భిణీ.. మరి కొద్ది రోజులలో పుట్టబోయే తన బిడ్డ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూసింది. తనకు పుట్టబోయే బిడ్డ కోసం కొన్న వస్తువులను చూపెడుతూ ఎంతో సంతోషంగా ఫోటోలు దిగింది. అయితే ఆమె సంతోషంపై కరోనా విషం చిమ్మింది. ఉన్నపళంగా తీవ్ర అస్వస్థతకు గురైన ఆ గర్భిణిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లగా.. కోవిడ్ ఉందేమోనన్న భయంతోనే ఆమెను ఆసుపత్రిలో చేర్చుకోవడానికి నిరాకరించారు. చివరికి అంబులెన్స్ లోనే మృతి చెందిన ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది.

హైదరాబాద్‌లోని మల్లాపూర్‌కు చెందిన జోగారావు, నీలవేణి దంపతుల కుమార్తె పావని(22)కి గతేడాది ఆగస్టులో ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన తిరుమల్‌రావుతో వివాహం జరిగింది. ఈ క్రమంలోనే పావని పురుడు కోసం హైదరాబాద్ వచ్చింది. ప్రస్తుతం 8 నెలలు గర్భిణిగా ఉన్న పావని హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుంది.ఈక్రమంలోనే జనరల్ చెకప్ కోసం వెళ్లిన ఆమెకు ఉమ్మనీరు తక్కువగా ఉండడంతో సెలైన్ ఎక్కించుకుని ఇంటికి వెళ్లారు.

శుక్రవారం తెల్లవారుజామున ఉన్నఫలంగా పావనికి ఆయాసం రావడంతో తన తల్లి తాను చికిత్స తీసుకుంటున్న ఆస్పత్రికి తీసుకెళ్ళింది.అయితే అక్కడ డాక్టర్లు ఆమెకు కరోనా ఉందేమోనన్న భయంతో చికిత్స అందించడానికి నిరాకరించారు. ఈ క్రమంలోనే మెరుగైన చికిత్స కోసం అంబులెన్స్ తీసుకొని మరో ఆసుపత్రికి తరలించగా అక్కడ కూడా వారికి అదే పరిస్థితి ఎదురైంది. ఈ విధంగా పావనిని పలు ఆసుపత్రులకు తీసుకెళ్లిన ఇప్పటికీ ఎవరూ చేర్చుకొని క్రమంలో ఆమె పరిస్థితి విషమించి అంబులెన్స్ లోనే మృతి చెందింది. ఉదయం నుంచి పావని తల్లి నీలవేణి తన బిడ్డను తన కడుపులో ఉన్న బిడ్డను కాపాడుకోవటం కోసం పడిన కష్టమంతా వృధా కావడంతో ఆ తల్లి కన్నీరుమున్నీరైంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

రిస్క్ చేస్తేనే మంచి సినిమా.. ‘డెకాయిట్’ క్లైమాక్స్‌పై నిర్మాత సుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు!

మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేన‌ని నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీల‌క‌మ‌ని, ఇప్పుడు ప్రేక్ష‌కులు…

Tuesday, 14 April 2026, 7:27 PM

ఐపీఎల్ జట్టు ఎందుకు కొనలేదు? అసలు నిజం చెప్పిన అభిషేక్ బచ్చన్.. అంత బడ్జెట్ నా దగ్గర లేదు!

నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…

Tuesday, 14 April 2026, 5:35 PM

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి అంటే?

ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ…

Tuesday, 14 April 2026, 3:21 PM

పాత ఫ్లాపులని గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తే బాధగా ఉంటుంది.. కృతి శెట్టి ఎమోషనల్ కామెంట్స్!

తాను గ‌తంలో చేసిన సినిమాలు చాలా వ‌ర‌కు ఫ్లాప్ అయ్యాయి క‌నుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…

Saturday, 11 April 2026, 8:35 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్‌పై చిరంజీవి ఎమోషనల్.. పరిశ్రమకు ఇది పెద్ద దెబ్బ అంటూ ఆవేదన!

తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన‌ చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంట‌ర్నెట్‌లో…

Friday, 10 April 2026, 6:40 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్.. 5 నిమిషాల యాక్షన్ సీన్ నెట్టింట వైరల్! షాక్‌లో చిత్ర యూనిట్..

తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…

Friday, 10 April 2026, 12:43 PM

ప్రొపగాండా అంటే ఏంటి? ‘ధురంధర్ 2’ విమర్శకులపై సందీప్ రెడ్డి వంగా నిప్పులు!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధ‌ర్ 2 ది…

Thursday, 9 April 2026, 11:07 PM

‘కిల్లర్’ మిల్లర్ ఇప్పుడు విలన్ అయ్యాడా? డీసీ ఓటమిపై సునీల్ గవాస్కర్ సంచలన విశ్లేషణ..

ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…

Thursday, 9 April 2026, 9:01 PM