Taraka Ratna : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ‘యువగళం’ పేరుతో చేస్తున్న పాదయాత్రతో పాల్గొన్ననందమూరి తారకరత్న కొద్ది దూరం నడిచాక కుప్పకూలి పోవడంతో వెంటనే టీడీపీ కార్యకర్తలు, నాయకులు తారకరత్నను స్థానిక కుప్పం ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనకు అత్యవసర చికిత్స అందించి వెంటనే మెగురైన వైద్య చికిత్స కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తారకరత్నకు అత్యంత ఖరీదైన ట్రీట్‌మెంట్ ఇస్తున్నట్టు తెలుస్తుంది.తారకరత్న ఆసుపత్రిలో ఉన్నప్పటి నుండి ఆయనకు ఆరోగ్యంకి సంబంధించి బాలకృష్ణ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
మరోవైపు కష్ట కాలంలో తారకరత్న ఫ్యామిలీకి అండగా నిలుస్తుంది టిడిపి ఇన్చార్జ్, టీటీడీ బోర్డు మాజీ సభ్యులు చల్లా రామచంద్రారెడ్డి కూడా ఉండడం గమనార్హం. చల్లా రామచంద్రరెడ్డికి తారకరత్నతో పార్టీ పరమైన సంబంధమే కాదు బంధుత్వం కూడా ఉంది. తారకరత్నను వివాహం చేసుకున్న అలేఖ్య రెడ్డి .. చల్లా రామచంద్రారెడ్డి పెద్దమ్మ కుమార్తెనే కావడం గమనార్హం. తారకరత్న 2012 ఆగస్టు 2న సంగీ టెంపుల్ లో అలేఖ్యరెడ్డిని కొంతమంది బంధుమిత్రుల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకున్నారు.
తారకరత్న పరిస్థితి ప్రస్తుతం కాస్త పరవాలేదు అన్నట్టుగా వైద్యులు ప్రకటించారు. దీంతో టీడీపీ కార్యకర్తలు, నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ప్రత్యేక విమానంలో బెంగళూరుకు చేరుకుని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో ఉన్నటువంటి తారకరత్నను పరామర్శించిన విషయం తెలిసిందే. తారకరత్న ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని వైద్యులు వెల్లడించారు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఎంతగానో ప్రార్ధిస్తున్నారు. తారకరత్నకు ఎక్మో ద్వారా చికిత్సను అందిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయని.. అందులో నిజం లేదని ప్రముఖులు చెబుతున్నారు. బ్రెయిన్ కు సంబంధించి చేసిన సిటీ స్కాన్ పరీక్షల రిపోర్టు రావాల్సి ఉందన్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…