Samantha Ring : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ తో బాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన సమంత పుష్ప సినిమాలో ప్రత్యేక పాటతో హిందీలో చాలా గుర్తింపు తెచ్చుకుంది. ఫ్యామిలీ మ్యాన్ తర్వాత హిందీలో ఆమె మరో వెబ్ సిరీస్ కు ఓకే చెప్పింది. అమెరికన్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్’కు హిందీ రీమేక్ కాగా, హిందీలోనూ సిటాడెల్ అనే పేరునే వస్తోంది. వరుణ్ ధావన్ హీరోగా నటిస్తుండగా, ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ సృష్టికర్తలు రాజ్ అండ్ డీకే దీన్ని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ షూటింగ్‌లో బిజీగా ఉంది సమంత.
అందరు స్టార్స్ మాదిరిగానే సమంతకి కూడా కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయి. హీరోయిన్లు చాలా వరకు సెంటిమెంట్లను నమ్మరు.కానీ తాజాగా సమంత మాత్రం వీటిని నమ్ముతున్నట్లు తెలిసింది. సమంత ప్రస్తుతం మానసికంగా, వ్యక్తిగతంగా బాధపడుతున్న విషయం మనకు తెలిసిందే. మయెసైటిస్ అనే వ్యాధి సమంతకి సోకడంతో మొన్నటి వరకు అమెరికాలో కూడా ట్రీట్మెంట్ చేయించుకుంది. అయితే ప్రస్తుతం కోలుకున్నట్టు తెలుస్తుండగా, ఇప్పుడు తను కమిట్ అయిన సినిమాల షూటింగ్స్‌లో పాల్గొంటుంది.
ఇటీవల సమంత ఓ ప్రమోషన్స్ లో పాల్గొన్నప్పుడు తన చేతికి ఉన్న మూడు రంగురాళ్లను జర్నలిస్టులు పసిగట్టారు. దీంతో ఆమె ఉంగరాల వైపు కూడా ఫోటోగ్రాఫర్లు క్లిక్ మనిపించారు.అయితే ఇదివరకు ఎప్పుడు సమంత చేతికి అన్ని ఉంగరాలు లేవని ఇప్పుడు అన్ని ఉంగరాలు పెట్టుకోవడంతో తను కూడా ఏదైనా సెంటిమెంట్ ను ఫాలో అవుతుందా అని అనుమానాలు వచ్చాయి. హిందూ సాంస్కృతి ప్రకారం అవి కొన్ని జాతకాల ప్రకారం అదృష్టం ప్రకారం ధరించినట్లు తెలిసింది. అయితే ఆమె ధరించిన ఉంగరంలో ఒకటి కనకపుష్యరాగం అనే ఉంగరం ఉంది. ఇక ఈ ఉంగరం సంపద, ఆరోగ్యం, కీర్తి, ఫలవంతమైన సంబంధాలను ఇస్తుందని కొన్ని శాస్త్రాలు చెబుతున్నాయి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…