Taraka Ratna Family : సినిమాల‌ని మించిన ట్విస్ట్‌లు తార‌క‌ర‌త్న ల‌వ్ స్టోరీలో.. అస‌లేం జ‌రిగిందంటే..!

January 30, 2023 2:45 PM

Taraka Ratna Family : నంద‌మూరి తార‌క‌ర‌త్న ప్ర‌స్తుతం గుండెపోటుతో బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విష‌యం తెలిసిందే. ఆయ‌న ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని డాక్ట‌ర్స్ చెబుతున్నారు. అభిమానులు త్వ‌ర‌గా కోలుకోవాలంటూ పూజలు చేస్తున్నారు. అయితే ఇలాంటి ప‌రిస్థితుల‌లో కొంద‌రు తార‌క‌ర‌త్న‌కు సంబంధించిన విషయాల‌ని తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. తార‌క‌ర‌త్న ల‌వ్ స్టోరీ సినిమాల‌ని మించిన ట్విస్ట్‌ల‌తో సాగింద‌ట‌. 2012లో తారకరత్న పెద్దలను ఎదిరించి అలేఖ్య రెడ్డిని వివాహం ప్రేమ వివాహం చేసుకున్నారు.

గతంలో ఒకసారి ఇంటర్వ్యూలో అలేఖ్య రెడ్డిని తమ వివాహం గురించి వెల్లడించారు. తారకరత్న చెన్నైలో తన సోదరికి స్కూల్ లో ఆమెకి సీనియర్ అని చెప్పింది.. ఆ తర్వాత కామన్ ఫ్రెండ్ ద్వారా తాము హైదరాబాద్ లో కలిశామని అన్నారు. వాస్తవానికి మేము మొదట మంచి ఫ్రెండ్స్‌గా ఉన్నాం కానీ ఆ తర్వాత.. తారక రత్న మొదట ప్రపోజ్ చేయ‌గా, అప్పుడు నేను మా పేరంట్స్‌తో మాట్లాడమని సూచించాను. కానీ వాళ్లు ఒప్పుకోలేదు. దానికి కారణం సినిమా ఇండస్ట్రీపై వారికి మంచి అభిప్రాయం లేక‌పోవ‌డ‌మే అని ఆమె చెప్పింది.

Taraka Ratna Family and wife interesting facts
Taraka Ratna Family

మరో వైపు నందమూరి ఫ్యామిలీ కూడా వీరి పెళ్లికి ఒప్పుకోలేదట. దానికి గల కారణాల్ని కూడా అలేఖ్య రెడ్డి వివరించారు. ‘‘తారక రత్న ఫ్యామిలీ కూడా మా పెళ్లికి ఒప్పుకోలేదు. దానికి కారణం.. నేను అప్పటికే పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్నా. మళ్లీ పెళ్లి చేసుకుంటానని అస‌లు అనుకోలేదు. ఆ సమయంలో మా అంకుల్ విజయసాయి రెడ్డి మాకు మద్దతుగా నిల‌వ‌డంతో మేము 2012, ఆగస్టు 2న సంఘీ టెంపుల్‌లో వివాహం చేసుకున్నాం. ఈ వివాహానికి ఇరు వైపు పెద్దలు ఎవరూ రాలేదు అని చెప్పింది అలేఖ్య‌. విజయసాయి రెడ్డి భార్య చెల్లెలు కుమార్తె ఈ అలేఖ్య రెడ్డి.తారక రత్న, అలేఖ్య రెడ్డికి 2013లో నిష్కా అనే పాప పుట్టింది. ప్ర‌స్తుతం వారు సంతోషంగానే ఉన్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment