Tammareddy Bharadwaj : రూ.50 కోట్లు రెమ్యున‌రేష‌న్ తీసుకుంటావు, పిల్ల‌ల ఫీజులు క‌ట్ట‌లేక‌పోతున్నావా.. అంటూ ప‌వ‌న్‌పై త‌మ్మారెడ్డి ఫైర్..

January 31, 2023 10:18 PM

Tammareddy Bharadwaj : సినిమాల‌లో ఉన్న‌ప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై ఏ ఒక్క‌రు కూడా నోరు జారే వారు కాదు. ఎప్పుడైతే రాజ‌కీయాల‌లోకి వ‌చ్చాడో సినిమా ఆర్టిస్టుల నుండి రాజ‌కీయ నాయ‌కుల వ‌ర‌కు ఆయ‌న‌ని ఏదో ఒక సంద‌ర్భంలో విమ‌ర్శిస్తూనే ఉన్నారు. అయితే ఇటీవ‌ల ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓ ప్ర‌సంగంలో పవన్ కళ్యాణ్ తన పిల్లల కోసం దాచుకున్న డబ్బుతో పార్టీ ఆఫీస్ నిర్మించానని కామెంట్స్ చేశారు.ఆ వ్యాఖ్య‌ల‌పై త‌మ్మారెడ్డి తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మార్కెట్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం మీరు 50 నుంచి 80 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటారని తెలుస్తుంది, .అంత రెమ్యునరేషన్ తీసుకుంటూ పిల్లల ఫీజులు కట్టలేరా అసలు ఎం మాట్లాడుతున్నారు.మీ కుటుంబ సభ్యుల పేర్లు చెప్పి రాజకీయాల్లో అల్లరి చేస్తారు అంటూ మండి పడ్డారు.

ప్రత్యేక హోదా కోసం మీరు పోరాటం చేయరు.కనీసం జైలుకు కూడా వెళ్ళలేదు కదా, అంత మంది బౌన్సలర్లతో బిల్డప్ ఎందుకు? నేను సామాన్యవ్యక్తినే అంటారు కదా మరి అలాగే వెళ్లి ప్రజల్ని కలవండి.మీ కోసం ఎంత మంది ఎదురుచూస్తున్నారో తెలుసా అని ప్రశ్నించారు తమ్మారెడ్డి భరద్వాజ.ఎప్పుడో ఒకసారి రావడం మీటింగ్ పెట్టి అందరిని తిట్టి వెళ్లిపోవడం కాదు ఇదంతా ఎందుకు అనవసరంగా టైం వేస్ట్ ప‌ని. ముందు పెండింగ్ లో ఉన్న సినిమాలు అన్నీ పూర్తి చేయండి.సినిమాలు చేస్తూనే, రాజకీయాలు కూడా చేస్తున్నారు.కానీ మీరు గాడి తప్పుతున్నారు. పార్టీ పెట్టినప్పుడు మంచి యువకుడు వస్తున్నాడు అని సంతోష పడ్డాం కాని మీ వైఖరితో విసిగిపోతున్నాం అంటూ తమ్మారెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

Tammareddy Bharadwaj questioned pawan kalyan about his money
Tammareddy Bharadwaj

అలానే మీ నాన్న గారు దేవుడు దీపం వద్ద సిగరెట్ వెలిగించుకున్నారు అని చెప్పావు, మీ నాన్నగారు నాకు పర్సనల్ గా తెలుసు. ఆయన అలా ప్రవర్తిస్తారని అనుకోను. ఆంధ్రా తెలంగాణ అని ఏదేదో మాట్లాడుతున్నారు.. విడదీస్తే చంపేస్తాం.. పొడిచేస్తాం అంటున్నారు. అప్పట్లో కేసీఆర్ ఆంధ్రావాళ్లని అడ్డమైన బూతులు తిట్టారు. అప్పుడేమైపోయారు? ఒక్కరోజైనా మాట్లాడారా? మీ ఫ్యాన్స్‌ని కొట్టినప్పుడు కూడా మీరు బయటకు రాలేదు. నేను వెళ్లాను.. మీ ఫ్యాన్స్‌ తరుపున నేను నిలబడ్డాను. ప్రత్యేక ఆంధ్ర కోసం మీరు పిలుపునిచ్చినప్పుడు నేను వెళ్లాను విశాఖ. నాతో పాటు సంపూర్ణేబాబు వచ్చాడు. అప్పుడు అతన్ని అరెస్ట్ చేశారు. నాకు వార్నింగ్ ఇచ్చారు. అసలు మీరు ప్రజలకోసం ఏం చేశారో చెప్పండి అంటూ త‌మ్మారెడ్డి దారుణ‌మైన కామెంట్స్ చేశారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now