Tamannaah : మిల్కీ బ్యూటీ తమన్నా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపుగా 15 ఏళ్లు కావస్తోంది. అయినప్పటికీ ఈమె ఇప్పుడు కూడా ఇంకా బిజీగానే ఉంది. ఆఫర్ల విషయంలో కుర్ర హీరోయిన్లతో ఈమె పోటీ పడుతోంది. ఈమధ్యే విడుదలైన ఎఫ్3 ద్వారా తమన్నా మనల్ని పలకరించగా.. మెగాస్టార్ చిరంజీవి సరసన ఈమె భోళా శంకర్ మూవీలోనూ నటిస్తోంది. తెలుగుతోపాటు హిందీ, తమిళం వంటి ఇతర భాషలకు చెందిన చిత్రాల్లోనూ తమన్నా నటించింది. ఈ క్రమంలోనే ఈమె ప్రస్తుతం పలు వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉంది.
ఇక తమన్నాతో ఇండస్ట్రీలోకి వచ్చిన చాలా మంది హీరోయిన్లు ఇప్పటికే పెళ్లిళ్లు చేసుకుని సెటిల్ అయిపోయారు కూడా. కానీ ఈమె మాత్రం ఇంకా పెళ్లి ఊసే ఎత్తడం లేదు. కాగా ప్రస్తుతం తమన్నా తెలుగుతోపాటు ఇతర భాషల్లోనూ కలిపి మొత్తం 3 సినిమాల్లో యాక్ట్ చేస్తోంది. ఇక తమన్నా ఇటీవలే సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో కాసేపు సరదాగా ముచ్చటించింది. అందులో పలు ఆసక్తికరమైన విషయాలను ఈమె వెల్లడించింది.
తాను ఎఫ్3 మూవీలో నటించిన సందర్భంగా ఆ చిత్ర విషయాలను ఆమె పంచుకుంది. అందులో తమన్నా కాసేపు అబ్బాయి గెటప్‌లో నటిస్తుంది. అయితే ఆ గెటప్ వేయడం చాలా కష్టంగా అనిపించిందని చెప్పింది. ఇక తనకు ఉన్న జబ్బు గురించి చెప్పి కూడా ఆమె అందరికీ షాకిచ్చింది. తాను మెమొరీ లాస్ పేషెంట్‌ని అని.. తనకు ఏవీ గుర్తు ఉండడం లేదని చెప్పింది. దీని వల్లే ప్రస్తుతం చాలా ఇబ్బందులు పడుతున్నానని చెప్పింది. అయితే ఈ వ్యాధి నయం అవుతుందా.. లేదా.. అన్నది మాత్రం చెప్పలేదు. కానీ ఫ్యాన్స్ మాత్రం ఆమె త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…