Tamannaah : త‌న జ‌బ్బు గురించి చెప్పి అంద‌రికీ షాకిచ్చిన త‌మ‌న్నా..!

July 7, 2022 5:09 PM

Tamannaah : మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా గురించి తెలుగు ప్రేక్ష‌కులకు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈమె సినిమా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి దాదాపుగా 15 ఏళ్లు కావ‌స్తోంది. అయిన‌ప్ప‌టికీ ఈమె ఇప్పుడు కూడా ఇంకా బిజీగానే ఉంది. ఆఫ‌ర్ల విష‌యంలో కుర్ర హీరోయిన్లతో ఈమె పోటీ ప‌డుతోంది. ఈమ‌ధ్యే విడుద‌లైన ఎఫ్3 ద్వారా త‌మ‌న్నా మ‌న‌ల్ని ప‌ల‌క‌రించ‌గా.. మెగాస్టార్ చిరంజీవి స‌ర‌స‌న ఈమె భోళా శంక‌ర్ మూవీలోనూ న‌టిస్తోంది. తెలుగుతోపాటు హిందీ, త‌మిళం వంటి ఇత‌ర భాష‌ల‌కు చెందిన చిత్రాల్లోనూ త‌మ‌న్నా న‌టించింది. ఈ క్ర‌మంలోనే ఈమె ప్ర‌స్తుతం ప‌లు వ‌రుస సినిమాల‌తో ఎంతో బిజీగా ఉంది.

ఇక త‌మ‌న్నాతో ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన చాలా మంది హీరోయిన్లు ఇప్ప‌టికే పెళ్లిళ్లు చేసుకుని సెటిల్ అయిపోయారు కూడా. కానీ ఈమె మాత్రం ఇంకా పెళ్లి ఊసే ఎత్త‌డం లేదు. కాగా ప్ర‌స్తుతం త‌మ‌న్నా తెలుగుతోపాటు ఇత‌ర భాష‌ల్లోనూ క‌లిపి మొత్తం 3 సినిమాల్లో యాక్ట్ చేస్తోంది. ఇక త‌మ‌న్నా ఇటీవ‌లే సోష‌ల్ మీడియాలో ఫ్యాన్స్‌తో కాసేపు స‌ర‌దాగా ముచ్చ‌టించింది. అందులో ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను ఈమె వెల్ల‌డించింది.

Tamannaah told about her disease netizen surprise
Tamannaah

తాను ఎఫ్3 మూవీలో న‌టించిన సంద‌ర్భంగా ఆ చిత్ర విష‌యాల‌ను ఆమె పంచుకుంది. అందులో త‌మ‌న్నా కాసేపు అబ్బాయి గెట‌ప్‌లో న‌టిస్తుంది. అయితే ఆ గెట‌ప్ వేయ‌డం చాలా క‌ష్టంగా అనిపించింద‌ని చెప్పింది. ఇక త‌న‌కు ఉన్న జ‌బ్బు గురించి చెప్పి కూడా ఆమె అంద‌రికీ షాకిచ్చింది. తాను మెమొరీ లాస్ పేషెంట్‌ని అని.. త‌న‌కు ఏవీ గుర్తు ఉండ‌డం లేద‌ని చెప్పింది. దీని వ‌ల్లే ప్ర‌స్తుతం చాలా ఇబ్బందులు ప‌డుతున్నాన‌ని చెప్పింది. అయితే ఈ వ్యాధి న‌యం అవుతుందా.. లేదా.. అన్న‌ది మాత్రం చెప్ప‌లేదు. కానీ ఫ్యాన్స్ మాత్రం ఆమె త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆశిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now